Central Government : రేషన్‌ కార్డులకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీ..దేశవ్యాప్తంగా అమలు

దేశంలోని ఇల్లు లేని పేదలు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు6,2022) పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు.

Central Government : రేషన్‌ కార్డులకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీ..దేశవ్యాప్తంగా అమలు
ad

Central Government : దేశంలోని ఇల్లు లేని పేదలు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు6,2022) పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు.

అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదు చేసుకొని రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Pensions Ration Cards : గుడ్ న్యూస్.. త్వరలో వారందరికి పెన్షన్లు, రేషన్ కార్డులు

వెరిఫికేషన్‌ కోసం ఆ డాటాను సంబంధిత రాష్ట్రాలకు పంపనున్నారు. వారు రేషన్‌ కార్డు పొందిన తర్వాత ‘వన్‌రేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు’ కార్యక్రమం కింద దేశంలోని ఏ రేషన్‌ షాపులోనైనా ఆహారధాన్యాలు తీసుకునే అవకాశం కల్పించారు.