Pensions Ration Cards : గుడ్ న్యూస్.. త్వరలో వారందరికి పెన్షన్లు, రేషన్ కార్డులు

తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.

Pensions Ration Cards : గుడ్ న్యూస్.. త్వరలో వారందరికి పెన్షన్లు, రేషన్ కార్డులు

Pensions Ration Cards

Pensions Ration Cards : తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఇంకా అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులను సైతం మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన ఒకటి రెండు నెలల్లోనే ప్రారంభం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అలాగే సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించే వారికి కూడా అండగా ఉంటామన్నారు. వారికి కూడా రుణాలను మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు.

Ration Aadhar: రేషన్ కార్డు ఆధార్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగింపు

”రాష్ట్రంలో వచ్చే రెండు నెలల్లో అర్హులకు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం సంపద పెంచి పేదలు పంచుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని కార్పొరేట్లకు పంచుతోంది. తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. దేశంలో బీజీపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. గోదావరి చరిత్రలోనే భారీ వరదలు సంభవిస్తే.. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజలను రక్షించాం. దీనిపై బీజేపీ నేతలు హైదరాబాద్ లో ఉండి బురద రాజకీయం చేయడం దారుణం” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 లక్షలమందికి మాత్రమే పెన్షన్ ఉండేదని తెలంగాణ మంత్రులు గుర్తు చేశారు. అప్పట్లో పెన్షన్ 200, 500 ఉండేదన్నారు. ఆ తర్వాత పెన్షన్ల సంఖ్య 40 లక్షలకు పెరగగా.. పెన్షన్ మొత్తం రూ.2వేలు అయిందన్నారు. ఆ తర్వాత ఇంకా పెరిగి రూ.3 వేలైందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం పెన్షన్లకు 800 కోట్లు ఖర్చుపెడితే.. తెలంగాణలో 10వేల కోట్లు పెన్షన్లకు ఖర్చవుతోందన్నారు. పేద ప్రజల ముఖంలో చిరునవ్వు చూడటమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.