Kashi Temple : కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి మూడు రోజులు బ్రేక్

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు.

Kashi Temple : కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి మూడు రోజులు బ్రేక్

Kashi Temple

Kashi Temple : ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. చాలాకాలంగా ఆలయ పునరుద్ధరణ పనులు చేయాలనీ పండితులు, అధికారులు బావించినప్పడికి ఆ పని వాయిదా పడుతూ వచ్చింది.

చదవండి : Kashi Mosque Row : కాశీలో మసీదు సర్వేపై అలహాబాద్ హైకోర్టు స్టే

ఇక ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 తేదీవరకు ఆలయ గర్భగుడి రాతికట్ట పెయింటింగ్, గోడలు శుభ్రం చేయడంతోపాటు ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక సమయాల్లో కొద్దిమంది భక్తులకు స్వామివారి దర్శన అవకాశం ఇస్తారు. డిసెంబర్ 13 తర్వాత దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

చదవండి : UP : కాశీ విశ్వనాథుని కారిడార్ పనులు పూర్తి ఎప్పుడంటే