దుర్గమ్మ పూజలో నూస్రత్ జహాన్ డ్యాన్స్

దుర్గమ్మ పూజలో నూస్రత్ జహాన్ డ్యాన్స్

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ NUSRAT JAHAN కోల్‌కతాలో జరిగిన దుర్గమ్మ పూజలో మెరిశారు. సంప్రదాయ వాయిద్యాలు మోగుతున్న వేళ డ్యాన్స్ చేస్తూ.. వెస్ట్ బెంగాల్ సందడిగా జరుపుకునే పండుగను ఎంజాయ్ చేశారు. 2నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఇంగ్లీష్ మీడియా పోస్టు చేసింది. రెడ్, వైట్ కలర్ శారీలో మిగిలిన ఆడవాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ క్లిప్ లో ఆమె రెగ్యూలర్ డ్రమ్స్ వాయించేవాళ్లతో పాటు డ్రమ్స్ ప్లే చేశారు.

పండుగ ఉత్సాహంలో టీఎంసీ ఎంపీ వేస్తున్న స్టెప్పులు, ఆమె ప్రదర్శన మొబైల్ కెమెరాల్లో రికార్డ్ అయింది. కొవిడ్ నియమాల ప్రకారం.. మాస్క్ లు వాడుతూ.. సోషల్ డిస్టెన్సింగ్ తో సెలబ్రేట్ చేసుకున్నారు.



గత నెలలో తృణమూల్ కాంగ్రెస్ లీడర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గత నెలలో దుర్గమాత పూజల్లో ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో దుమారంగా మారింది. అవి తెలుసుకున్న ఆమె ఆఫీసు అధికారులను అలర్ట్ చేసి అప్రమత్తం అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, దాడి చేస్తామని బెదిరించడం జహాన్ కు కొత్తేం కాదు.

హిందూని పెళ్లాడి, సిందూరం పెట్టుకున్నప్పటి నుంచి తప్పడం లేదు. ‘నేను దేవుడి ప్రత్యేకమైన శిశువుని. అన్ని పండుగలు జరుపుకుంటాను. నేను మానవత్వాన్ని గౌరవిస్తాను. మిగతా వాటన్నిటి కంటే ఎక్కువగా ప్రేమిస్తాను కూడా’ అని ఆమె చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది సెలబ్రేషన్స్ రేంజ్ తగ్గిపోయింది. బెంగాల్ లో 3.4లక్షల మంది దీని కారణంగా ఎఫెక్ట్ అయ్యారు. ఇండియా వ్యాప్తంగా 78లక్షల మంది కరోనా ప్రభావానికి గురయ్యారు. జనవరి నుంచి 1.17లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.