ట్రంప్‌కు రాష్ట్రపతి ప్రత్యేక విందు : మెరెల్ పుట్టగొడుగులు..పప్పు,మటన్ బిర్యానీ

  • Published By: veegamteam ,Published On : February 25, 2020 / 07:25 AM IST
ట్రంప్‌కు రాష్ట్రపతి ప్రత్యేక విందు : మెరెల్ పుట్టగొడుగులు..పప్పు,మటన్ బిర్యానీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముక్కలేని ముద్ద దిగదు. అంటే ట్రంప్ కు మాంసాహారమంటే చాలా చాలా ఇష్టం. బీఫ్ చేపలు, మాంసం వంటివి చాలా ఇష్టంగా తింటారు. కానీ భారత పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇచ్చే విందులో కూడా ఇటువంటివి కానరావటంలేదు. 

ముక్కలేనిదే ట్రంప్‌కు ముద్ద దిగదు.అదికూడా బీఫ్ లాంటి సాలీడ్ మాంసం కావాలి.  కానీ ట్రంప్ భారత్ పర్యటలో ట్రంప్ కు నిన్న అహ్మదామాద్ లో గుజరాత్ ప్రత్యేక వంటలు మాత్రమే మెనూలో ఉన్నాయి. అన్నీ శాఖాహారాలే. ఈరోజు రాజ్ భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందు మెనూలో హిమాలయాల నుండి ప్రత్యేకించి తీసుకొచ్చిన ఖరీదైన మోరెల్ పుట్టగొడుగులు..రాష్ట్రపతి భవన్ కే స్పెషల్ అయినా పప్పు వంటకం, ఆలూ టీక్కా, బచ్చలికూర, నిమ్మకాయ,కొత్తిమీరతో చేసిన సూప్ తో పాటు ట్రంప్ కు చాలా ఇష్టమైన మాంసాహారాన్ని కూడా సిద్ధం చేయనున్నారు. బఠానీలు, పుదీనా రైస్ లతో పాటు మరెన్నో వంటకాలు సిద్ధంకానున్నాయి. 

See Also>>ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్‌లో ట్రంప్‌ భార్య

ముక్కలేనిదే ముద్ద దిగన ట్రంప్‌కు రాజ్ భవన్‌లో ప్రత్యేకించి మాంసాహారాన్ని కూడా సిద్ధం చేయనున్నారు.  మటన్ బిర్యానీ,మేక కాలుతో చేసిన స్పెషల్ వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. వీటితో పాటు నోరూరించే ఫిష్ టిక్కాలు మెనూలో కొలువుతీరనున్నాయి. కానీ ట్రంప్ కు ఇష్టమైన బీఫ్ మాత్రం ఉండటంలేదు. దీంతో ట్రంప్ ఫుడ్ విషయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

కానీ ట్రంప్ ఫుడ్ విషయంలో రాజీపడని అమెరికా అధికారులు.. ప్రస్తుతం భారత్ పర్యటనలో మాత్రం పూర్తిగా శాకాహార వంటకాలనే చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కు చాలా ఇష్టమైన బీఫ్..ఫిష్..beef స్టీక్స్, బర్గర్లు వంటివి లేకపోవటంతో వారు ఆందోళన వ్యక్తంచేస్తూ..సలాడ్‌తో కూడిన భోజనం మినహా ట్రంప్‌ శాకాహార పదార్థాలు తినడం తాను ఒక్కసారి కూడా చూడలేదని, ఈసారి ఏం జరుగుతుందోనంటూ ఓ అధికారి వాపోయారు.
 

ట్రంప్‌ ఉడికించిన లేదా కాల్చిన మాంసం, బీఫ్‌ బర్గర్లు, మీట్‌లోఫ్ (మాంసంతో చేసిన రొట్టెలు) ఆహారంలో తీసుకుంటారని, విదేశీ పర్యటనల్లో స్టీక్స్‌ అందుబాటులో లేకుంటే గొర్రె మాంసం ఉంటుందన్నారు. మెక్‌డొనాల్డ్‌లో లభించే బీఫ్‌ బర్గర్లు అంటే ట్రంప్‌కి చాలా ఇష్టమని, అయితే ఇక్కడ బ్రాంచీల్లో చికెన్‌ బర్గర్లు మాత్రమే లభిస్తాయని పేర్కొన్నారు. కాగా..రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు ఇచ్చేప్రత్యేక విందులో 100మంది వీఐపీలు హాజరుకానున్నారు. 

ఇదిలా ఉండగా గతంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షులకు కూడా స్థానిక వంటకాలనే రుచిచూపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2006లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కి స్థానిక వంటకాలైన కూరలు, బిరియానీ, సీఫుడ్స్ వడ్డించారు. ఇక, భారత్‌లో రెండుసార్లు పర్యటించిన ఏకైక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా భారతీయ వంటకాలను ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తిన్నారు. చికెన్ షామీ కెబాబ్, ఆచారీ షిఫ్ టిక్కా, పిస్తా ముర్ఘ్, మస్టర్డ్ ఫిష్ కర్రీ, గుస్తాబా, ఆచారీ పన్నీర్ లాంటి వంటకాలను ఒబమా రుచిచూశారు.