సర్వీస్ సెంటర్‌లో ఫోన్ రీప్లేస్ చేయనన్నారని నిప్పంటించుకున్న మేనమామ

సర్వీస్ సెంటర్‌లో ఫోన్ రీప్లేస్ చేయనన్నారని నిప్పంటించుకున్న మేనమామ

Phone Replacement: ఓ 40ఏళ్ల వ్యక్తి తన మేనకోడలి కోసం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ రిపైర్ వచ్చింది. దానిని రిపైర్ కాకుండా రీప్లేస్ చేయాలంటూ మాల్ కు వెళ్లి సర్వీస్ సెంటర్ లో అడిగాడు. వాళ్లు ససేమిరా అనడంతో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.

బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బాధితుడు.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇలా ఉంది. ఒక నెలరోజుల క్రితం ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలోని స్టోర్ లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాం. కొద్ది రోజుల తర్వాత ఫోన్ పనిచేయకుండాపోయింది. నవంబరు 6వ తేదీ సౌత్ రోహిణీలో ఉన్న ఎంటూకే మాల్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి రీప్లేస్‌మెంట్ అడిగా. వాళ్లు దానికి ఒప్పుకోలేదు.



‘ఆ తర్వాత మళ్లీ కొన్ని సార్లు అడిగినా ప్రయోజనం లేదు. ఈ రోజు ఉదయం రెస్పాన్స్ ఇవ్వకపోతే నిప్పు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయానని’ మిశ్రా చెప్పాడు. అతని రిక్వెస్ట్ ను పట్టించుకోకపోవడంతో పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు భీమ్ సింగ్.

బాధితుడు భార్య మాట్లాడుతూ.. ‘ఆ ఫోన్ ను తన సోదరి కూతురు కోసం కొన్నాడు. ఆమె పన్నెండో తరగతి చదువుతుంది. తల్లి నెల క్రితం చనిపోవడం.. ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కావాల్సి ఉండటంతో ఫోన్ కొనిచ్చాడు. చనిపోతూ తన కూతురు బాధ్యత చూసుకోవాలని అన్నను కోరింది. క్లాసులకు తప్పకుండా హాజరుకావాల్సి ఉండటంతో రూ.14వేలు ఖర్చు పెట్టి ఫోన్ కొన్నాడు.

10రోజుల క్రితం ఫోన్ అనుకోకుండా చేజారి పడిపోయింది. దాని అద్దం ముక్కలుముక్కలుగా విడిపోయింది. ‘మా లాంటి కుటుంబాలకు అది చాలా కాస్ట్లీ ఫోన్ అనే చెప్పాలి. అలా జరగడంతో ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోయింది’

శుక్రవారం ఉదయం పనికి అని చెప్పి వెళ్లిన సింగ్ గురించి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. కాలిన గాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ‘అతను సర్వీస్ సెంటర్ కు వెళ్తున్నానని కూడా తనకు చెప్పలేదని, హాస్పిటల్ లో ఉన్న సమయంలో తనకు తానే నిప్పు పెట్టుకున్నట్లు చెప్పాడని’ అతని భార్య చెప్పింది. మాకు పదో తరగతి చదువుతున్న ఒక కొడుకు ఉన్నాడు.