ఖాకీ కావరం, కాలు లేని వ్యక్తిని కిందపడేసిన పోలీస్

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 08:04 AM IST
ఖాకీ కావరం, కాలు లేని వ్యక్తిని కిందపడేసిన పోలీస్

UP Cop Drags : తాను పోలీస్..ఎవరూ ఏం చేయరని అనుకుంటున్నారు కొంతమంది ఖాకీలు. ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. కాలు లేని ఓ వికలాంగుడిని పోలీసు కిందపడేశాడు. కనికరం లేకుండా..ఆ పోలీసు చేసిన దుశ్చర్యపై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.



దీంతో ఉన్నతాధికారులు స్పందించి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలోని Kannauj లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వికలాంగుడి తల వెనుక భాగంలో గట్టిగా పట్టుకుని కిందకు పడేయడం వీడియోలో కనిపించింది.

వికలాంగులు నడిపే రిక్షాను నడిపించుకుంటున్నానని, రోడ్డుపై ప్రయాణీకులను ఎక్కించుకుంటున్న క్రమంలో కానిస్టేబుల్ తనను వేధింపులకు గురి చేశాడని బాధితుడు వెల్లడించారు. రోడ్డు మధ్యలో ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నాడని, దీనిని ప్రశ్నిస్తే..వికలాంగుడు తనతో వాగ్వాదానికి దిగాడని కానిస్టేబుల్ వెల్లడించాడు.



దీనిపై Kannauj జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రతాప్ సింగ్ స్పందించారు. కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించనట్లు, ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. పోలీసులు నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు శిక్షణ ఇస్తామన్నారు.