UP: యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాకేశ్ సచాన్ గతంలో సమాజ్‭వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్‭పాల్ యాదవ్‭లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికమ ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి యోగి కేబినెట్‭ టెక్స్‭టైల్, ఎంఎస్ఎంఈ మంత్రిగా పదవి పొందారు

UP: యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు

UP minister Rakesh Sachan found guilty in Arms Act

UP: 1991 నాటి అక్రమ ఆయుధాల కేసులో ఉత్తర ప్రదేశ్‭ మంత్రి రాకేశ్ సచాన్‭ దోషని కాన్పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో తీవ్ర అసహనానికి గురైన ఆయన.. వెంటనే కోట్లు మెట్లు దిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వెంటే ఆయన మద్దతుదారులు, లాయర్లు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే మంత్రి ఈ ఆరోపణలు ఖండించారు. తనపై ఇంకొన్న కేసులు పెండింగ్‭లో ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిణామాలు తప్పుదోవ పట్టించేలా అన్నాయని అన్నారు. అయితే ప్రస్తుత తీర్పుపై ఆయనను ప్రశ్నించగా కోర్టు తీర్పును గౌరవిస్తానని రాకేశ్ పేర్కొన్నారు.

రాకేశ్ సచాన్ గతంలో సమాజ్‭వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్‭పాల్ యాదవ్‭లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికమ ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి యోగి కేబినెట్‭ టెక్స్‭టైల్, ఎంఎస్ఎంఈ మంత్రిగా పదవి పొందారు. తాజా తీర్పులో రాకేశ్‭పై కత్వాలి పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయమై తనకు ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కాన్పూర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ తెలిపారు.

Israel Palastine war: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 28 మంది మృతి.. వందలాది మందికి గాయాలు