Woman Saree Grab: న‌డిరోడ్డుపై మ‌హిళ చీర లాగిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు

బీజేపీ కార్యకర్తలు ఓ మహిళను నడిరోడ్డుమీద దారుణంగా అవమానించారు. ఆమె చీర పట్టుకుని లాగారు. చేతిలో పేపర్లు తీసుకుని చింపేసిన ఘటన యూపీ రాజకీయాల్లో మంట పుట్టించింది.

Woman Saree Grab: న‌డిరోడ్డుపై మ‌హిళ చీర లాగిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు

Up Bjp Workers Of Pulling Woman Saree

Woman Saree Grab : మహిళలపై జరిగే నేరాలు..హింసలకు ఉత్తరప్రదేశ్ అడ్డాగా మారింది. ఈ రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలపై జరిగిన ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు. హత్యలు, మానభంగాలు, హింసలకు అంతే లేకండాపోతోంది. ఈక్రమంలో మరోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఓ మహిళను నడిరోడ్డుమీద ఘోరాతి ఘోరంగా అవమానించారు కొంతమంది మగవాళ్లు. వీరంతా రాజకీయ పార్టీకి చెందినవారు కావటంతో ఏమాత్రం భయం లేకుండా..కనీసం మహిళ అనే విచక్షణ లేకుండా ప్రవర్తించారు. నడిరోడ్డుపై ఓ మహిళ చీర పట్టుకుని లాగి అవమానించారు.

ఈక్రమంలో యూపీలో జరిగిన రాజకీయల్లో భాగంగా ఓ మహిళను నడిరోడ్డమీద చీర పట్టుకుని లాగిన ఘటన సంచలనం కలిగించింది. బ్లాక్ పంచాయ‌తీ ఎన్నిక‌లు జరుగనున్న క్రమంలో అధికార పార్టీ బీజేపీ, ప్ర‌తిప‌క్ష పార్టీ స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుల మ‌ధ్య వాగ్వాదాలు..తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో ల‌ఖింపూర్‌ఖేరీ జిల్లాలోని పాస్‌గ్వాన్ బ్లాక్ నుంచి బ‌రిలో ఉన్న ఎస్పీ మ‌హిళా నాయ‌కురాలు రీతూ సింగ్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేసేందుకు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ కార్యాల‌యానికి బ‌యలురేరారు.ఈ క్ర‌మంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆమెను న‌డిరోడ్డుపై అడ్డ‌గించారు. అయినా ఆమె ఆగ‌కపోవటంతో రీతూ సింగ్ చీర‌ను లాగారు. నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కొని చింపేశారు. ఈ దారుణాన్ని అడ్డుకోకుండా కొంతమంది ఈ దృశ్యాలను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోను ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. సీఎం యోగిఆదిత్యానాత్ ప్ర‌భుత్వం గుండాగిరి చేస్తోంద‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. అయితే మ‌హిళ‌పై దాడి వెనుక స్థానిక బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్ర‌తాప్ సింగ్ ఉన్నార‌ని ఎస్పీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బాధిత మ‌హిళ రీతూ సింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయటంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.