Electricity Rates: విద్యుత్ ఛార్జీలు తగ్గించిన యూపీ ప్రభుత్వం.. కోటి కుటుంబాలకు లబ్ధి

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది.

Electricity Rates: విద్యుత్ ఛార్జీలు తగ్గించిన యూపీ ప్రభుత్వం.. కోటి కుటుంబాలకు లబ్ధి

Electricity Rates: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం తాజాగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. నిన్నటి (గురువారం) నుంచే తగ్గిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

ప్రతి స్లాబ్‌లోనూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ యూనిట్‌కు యాభై పైసల నుంచి ఒక్క రూపాయి వరకు ఈ తగ్గింపు అమలు కానుంది. అయితే, గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీని ద్వారా దాదాపు కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. మరోవైపు ఇప్పటివరకు అమలవుతున్న యూనిట్‌కు ఏడు రూపాయల స్లాబ్‌ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అన్ని స్లాబుల్లో కలిపి అత్యధిక యూనిట్ రేటు రూ.6.50గా నిర్ణయించారు. ఈ మార్పులకు సంబంధించిన నిర్ణయాన్ని గత నెల 23నే తీసుకున్నప్పటికీ ఈ నెల 4 నుంచి అమల్లోకి తెచ్చారు.

Karnataka Horror: నాలుగేళ్ల కూతురును నాలుగో అంతస్థు నుంచి పడేసి చంపిన తల్లి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

తాజా నిర్ణయం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో వంద యూనిట్లలోపు యూనిట్‌కు రూ3.35, 100-150 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.85, 151-300 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.00, 300 పైన యూనిట్లకు యూనిట్‌కు రూ.5.50గా నిర్ణయించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా యూనిట్‌కు రూ.6.50గా ఉంది.