V-Sat 2022 : విజ్ఞాన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశానికి వీ-శాట్ నోటిఫికేషన్

డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ ఆనర్స్‌(అగ్రికల్చర్‌), బీఎస్సీ (ఎంఎ్‌ససీఎస్‌), బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)కోర్సులున్నాయి.

V-Sat 2022 : విజ్ఞాన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశానికి వీ-శాట్ నోటిఫికేషన్

Vignans V Sat 2022

V-Sat 2022 : గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ వీ – శాట్‌ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌, పన్నెండోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు, ప్రస్తుతం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీ శాట్‌ ర్యాంక్‌ , జేఈఈ మెయిన్‌ ర్యాంక్‌, నీట్‌ స్టేట్‌ ర్యాంక్‌, ఏపీ, టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంక్, సీబీఎస్ఈ +2 మార్కులు, ఇంటర్‌ మార్కుల ప్రకారం స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు.

డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ ఆనర్స్‌(అగ్రికల్చర్‌), బీఎస్సీ (ఎంఎ్‌ససీఎస్‌), బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)కోర్సులున్నాయి. బిఈ, బీటెక్‌ విభాగాల్లో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్‌, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, సీఎస్ఈలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ కోర్సులు, ఎలకాట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకాట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, రోబోటిక్స్‌ అండ్‌ ఆటొమేషన్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు: రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. వీ – శాట్‌ 2022 ను 2022 ఏప్రిల్‌ 25 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. పూర్తి విరాలకు వెబ్ సైట్ www.vignan.ac.in సంప్రదించగలరు.