Covid Vaccine : వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి..ఆధార్ లేదా స్కూల్ ఐడీ కార్డు కంపల్సరీ

పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కానీ లేదా జైడస్‌ కాడిలా కంపెనీ తయారుచేసిన జైకోవ్‌-డిని కానీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం.

Covid Vaccine : వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి..ఆధార్ లేదా స్కూల్ ఐడీ కార్డు కంపల్సరీ

Covin

Vaccination Registration : టీనేజ్‌లో ఉన్నారా.. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులా.. అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్‌లలో మీ ఇష్టమున్న కంపెనీ టీకాను ఎంచుకోండి. అందుకోసం ఆధార్‌ లేదా స్కూల్ ఐడీ కార్డు సిద్ధం చేసుకోండి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. టీనేజ్‌ వారికి జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టనుంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి ప్రికాషన్ డోసు ఇవ్వనుంది. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఆధార్‌ కార్డుతో కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. అయితే ఆధార్‌ కార్డులేని వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలిపింది కేంద్రం. ఆధార్‌ లేకపోతే విద్యాసంస్థల ఐడెంటిటీ కార్డుతో నమోదు చేసుకోచ్చని ప్రకటించింది.

Read More : Flights Cancelled : విమానాలు కదలడంలేదు..! 12 వేల విమానాలు రద్దు

పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కానీ లేదా జైడస్‌ కాడిలా కంపెనీ తయారుచేసిన జైకోవ్‌-డిని కానీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. వీటిల్లో ఏది కావాలన్నది రిజిస్ట్రేషన్ సమయంలో ఎంచుకోవాలని సూచించారు కోవిన్ పోర్టల్‌ చీఫ్‌ డాక్టర్ ఆర్‌ ఎస్ శర్మ. అటు దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటి వరకు 17 రాష్ట్రాలకే పరిమితమైన వైరస్‌ మరో రెండు రాష్ట్రాలకూ విస్తరించింది. దీంతో ఒమిక్రాన్‌ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరాయి. ఇప్పటివరకు దేశంలో విదేశాల నుంచి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్‌ వారికే ఒమిక్రాన్ సోకగా పలు రాష్ట్రాల్లో సెకండ్‌ కాంటాక్ట్‌ కూ సోకుతుండడం టెన్షన్ పెడుతోంది.