Rupee Fall affect : రూపాయి క్షీణిస్తే జరగబోయే నష్టాలేంటి ?సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం పడుతుంది..?

డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తే చాలా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. సామాన్యులపై రూపాయి పతనం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది.. ఏఏ వస్తువులు భారంగా కాబోతున్నాయ్..?

Rupee Fall affect : రూపాయి క్షీణిస్తే జరగబోయే నష్టాలేంటి ?సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం పడుతుంది..?

Rupee Fall Affect In The The Common Man

Rupee Fall affect in the the common man : డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తే చాలా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. తెలియకుండానే భారం మోయాల్సిన పరిస్థితి. ఇంతకీ సామాన్యులపై రూపాయి పతనం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది.. ఏఏ వస్తువులు భారంగా కాబోతున్నాయ్..?దీన్నుంచి తప్పించుకునే మార్గమే లేదా?

డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తే చాలా రకాల నష్టాలు ఉంటాయ్. రూపాయి బలహీనపడటంతో.. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చమురుతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలను భారత్‌ భారీగా దిగుమతి చేసుకుంటుంది. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం పడిపోవడంతో.. మరిన్ని ఎక్కువ రూపాయలు ఖర్చు కానున్నాయ్. దీంతో ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలు, ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య వంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

పెట్రోలియం ఉత్పత్తులలో 70శాతానికి పైగా భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులన్నింటికి డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి బలహీనంకావడంతో.. గతంలో కంటే దిగుమతులకు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి ఖరీదైతే… చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతాయ్. ఇంధన ధరలు పెరిగితే సరుకు రవాణా చార్జీలు పెరుగుతాయ్‌. ఈ అదనపు ఛార్జీలు కంపెనీలు, వ్యాపారాల మార్జిన్‌లను తగ్గిస్తాయ్. దీంతో ఆ భారం వినియోగదారులపై పడుతుంది. రికవరీ కోసం ఉత్పత్తి ధర పెరుగుతుంది. పెట్రోల్‌ ధరలు మాత్రమే కాదు.. ఆహారం, పప్పులు అన్నింటిపై రూపాయి క్షీణత ప్రభావం చూపిస్తుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై.. దీని ప్రభావం కనిపిస్తుంది.

Also read : Rupee Fall : చరిత్రలో తొలిసారి డాలర్‌కు 80 రూపాయలు..పతనానికి కారణమేంటీ..?

రూపాయి క్షీణత విదేశీ మారక నిల్వలను కూడా బలహీనం చేస్తుంది. విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో చదవడం మరింత ఖరీదు అవుతుంది. రూపాయి విలువ క్షీణిస్తే.. విదేశీ ప్రయాణాలకు, చదువులకు ఖర్చు చేసినప్పుడు… స్థానిక కరెన్సీకి ముందు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ నుంచి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ వరకు వినియోగదారులు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో విద్య ప్రయాణాల ఖర్చులు.. గత ఆరు నెలల్లో 7శాతం మేరకు పెరిగాయ్. ఇప్పుడు రూపాయి పతనం ప్రభావంతో మరింత భారం పడే అవకాశాలు ఉంటాయ్.

దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి సామాన్యుల జీవితాల వరకు.. డాలర్‌తో రూపాయి పతనం కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయ్. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ వంటి రంగాలపై ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లకు కూడా ఇబ్బందులు తప్పవు. ద్రవ్యోల్బణం ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న భారత్‌పై.. రూపాయి పతనం మరింత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయ్. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ప్రతికూలమే అవుతుంది. తక్కువ డబ్బును ఖర్చు చేసే కుటుంబాల వ్యయ నిర్ణయాలను ప్రభావితం చేసింది.

రూపాయి పతనం వల్ల కొన్ని రంగాలు లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయ్. ఎగుమతులు చేసే రంగాలకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. దీంతో వాటికి లాభాలు ఉంటాయ్. ఐటీ, ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్, టెక్స్‌టైల్స్ కంపెనీలకు లాభాలు పెరుగుతాయ్. దీంతో పాటు అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు అందుకునేవారికి లాభం అవుతుంది. ఎక్కువమందికి నష్టమే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. ఇంతకుముందు ఏదైనా వస్తువు వెయ్యి డాలర్లు అనుకుంటే.. 75వేలు చెల్లించాల్సి వచ్చేది.. ఇకపై 80వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సామాన్యులపై భారం ఎక్కువగానే పడే చాన్స్ ఉంటుంది. విదేశీ దిగుమతులను తగ్గించుకోవడంతో.. రూపాయి విలువను కంట్రోల్‌ చేసే అవకాశం ఉంటుంది..