Kerala Guv: ఆ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్

తాను రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎంకు సవాల్ విసిరారు. లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నారు.

Kerala Guv: ఆ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్

Kerala Guv: కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ మధ్య వివాదం ముదురుతోంది. తాను రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపిస్తే తన గవర్నర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ సీఎంకు సవాల్ విసిరారు గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

తాను రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు ఒక్క సంఘటన లేదా ఉదాహరణ చూపించాలని సీఎంను చాలెంజ్ చేశారు. యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల ఎంపికలో రాజకీయ పరంగా గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని కొద్ది రోజుల క్రితం సీఎం పినరయి ఆరోపించారు. ఈ ఆరోపణలను గవర్నర్ ఖండించారు. ‘‘నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని యూనివర్సీటీల్లో వీసీలుగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నానని కేరళ సీఎంతోపాటు ప్రభుత్వం నాపై పదేపదే ఆరోపణలు చేస్తోంది. నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్నే కాదు.. నా అధికారాన్ని ఉపయోగించుకుని, కనీసం ఏ ఒక్క వ్యక్తినైనా నామినేట్ చేసినట్లు నిరూపిస్తే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ అది నిరూపించలేకపోతే సీఎం తన పదవికి రాజీనామా చేస్తారా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు సీఎం ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చెబుతున్నారు.

Andhra Pradesh: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

అర్హత లేని వ్యక్తులతో యూనివర్సిటీల్లో ఖాళీల్ని భర్తీ చేసి, విద్యారంగాన్ని ఎలా బాగు చేస్తారు? బంగారం స్మగ్లింగ్ అంశంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం సన్నిహితులు.. స్మగ్లర్లతో సంబంధం కలిగి ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది’’ అని గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్ చేసిన ప్రకటనపై సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.