Woman Beats Dog : బాబోయ్.. మనిషేనా? కుక్కపిల్లను గాల్లోకి లేపి ఎలా నేలకేసి బాదిందో చూడండి.. వీడియో వైరల్

ఆగ్రాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మూగజీవి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన కుక్క పిల్లను ఇష్టానుసారంగా కొట్టింది. దాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి రోడ్డుకేసి బాదింది.

Woman Beats Dog : బాబోయ్.. మనిషేనా? కుక్కపిల్లను గాల్లోకి లేపి ఎలా నేలకేసి బాదిందో చూడండి.. వీడియో వైరల్

Woman Beats Dog : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మూగజీవి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన కుక్క పిల్లను ఇష్టానుసారంగా కొట్టింది. దాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి రోడ్డుకేసి బాదింది. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ.. ముందు విచక్షణారహితంగా కుక్కపిల్లను కొట్టింది. అయినా ఆమె కోపం చల్లారినట్లు లేదు. ఆ తర్వాత కుక్క మెడకు ఉన్న తాడు పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టింది. అలా 5సార్లు గాల్లోలోకి లేపి మరీ రోడ్డు మీద బాదింది. పాపం.. ఆ మూగజీవి.. విలవిలలాడిపోయింది.

అయినా ఆమె మనసు మాత్రం కరగలేదు. చాలా దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటనను కళ్లారా చూసిన చుట్టుపక్కల వాళ్లు.. భయంతో దూరం జరిగారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసినోళ్లంతా షాక్ కి గురవుతున్నారు. జంతు ప్రేమికులు బాధతో విలవిలలాడుతున్నారు. నోరు లేని జీవి అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా, దయ జాలి అన్నది లేకుండా.. కుక్క పట్ల ఆ మహిళ ప్రవర్తించిన తీరు తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తోంది.

మూగజీవి పట్ల అమానుషంగా, అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఆ మహిళను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మహిళ దాడిలో కుక్కపిల్ల తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉంది.

కుక్కపిల్లను ఎలా కొట్టిందో చూడండి..