World Elephant Day:ప్రపంచంలోనే వృద్ధ ఏనుగు విశేషాలు..చేసిన పనికి పెన్షన్ తో రాయల్ లైఫ్

  • Published By: nagamani ,Published On : August 12, 2020 / 12:28 PM IST
World Elephant Day:ప్రపంచంలోనే వృద్ధ ఏనుగు విశేషాలు..చేసిన పనికి పెన్షన్ తో రాయల్ లైఫ్

Updated On : August 13, 2020 / 9:08 AM IST

August 12.. ప్రపంచ ఏనుగుల దినోత్సం సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న ఓ అరుదైన ఆసియా ఏనుగు జీవితం గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏనుగులు 70 సంవత్సరాలకంటే ఎక్కువగానే బతుకుతాయని అంటారు. కానీ.. ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న ఏనుగుగా గుర్తింపు పొందిన ఈ ఏనుగుకు 86 ఏళ్లుపైనే . దాని పేరు బిజులీ ప్రసాద్. బిజులీ ప్రసాద్ అనే ఈ వృద్ధ ఏనుగును ఇంగ్లండ్‌లో ఉండే ఒలివర్ సాహిబ్… ఇండియాలోనిఅసోంలోని మాగర్ టీ ఎస్టేట్స్ దగ్గర ఉంచి పెంచారు. కాగా..బిజులీ ప్రసాద్ ను పెంచిన ఒలివర్ సాహిబ్ జీవించిలేరు.

ప్రస్తుతం మాగర్ గ్రూప్‌కి చెందిన బిహాలీ టీ ఎస్టేట్‌లో బిజులీ… రాజభోగం అనుభవిస్తూన్న ఈ మగ గజం మహారాజులా బ్రతుకుతోంది. పచ్చటి ప్రకృతిలో… పెద్ద పెద్ద అడుగులు వేస్తూ…ఠీవీగా..హాయిగా అలా అలా తిరుగుతూ ఉంటుంది బుజులీ.

1968లో బోర్గానా టీ కంపెనీ ఈ ఏనుగును కొనుక్కొని… పాత తేయాకు మొక్కల్ని పెకిలించే పని చేయించేది. దానితో పాటు ఇతర పనులు కూడా చేయించేది. అన్ని పనులు చక్కగా చేసేది బిజులీ. దీంతో ఆ యాజమాన్యానికి అందంటే ఇష్టం పెరిగింది. ఈ పనులు చేసినందుకు బిజులీకి నెలవారీ జీతం కూడా చెల్లించేది టీ ఎస్టేటు యాజమాన్యం. ఆ డబ్బుతో ఏనుగుకు ఇష్టమైన ఆహారం..అవసరమైన మెడిసిన్స్ వంటివి కొనేవారు. వయసు పెరిగింది..దీంతో బిజులీ ప్రసాద్ కు పెన్షన్ కూడా ఇస్తున్నారు. దీంతో బిహాలీ టీ ఎస్టేట్‌లో బిజులీహాయిగా బతికేస్తోంది.

ఇప్పుడు బిజులీ… బోర్గాంగ్‌లో ఉంటోంది. మాగర్ ఫ్యామిలీలో ఇదో కీలక మెంబర్‌గా ఉంటోంది. రిటైర్మెంట్ తర్వాత ఈ ఏనుగు దర్జాగా జీవిస్తోంది. మాగర్ ఫ్యామిలీ బిజులీని చూసుకోవటానికి దానికి సపర్యలు చేయటానికి ఇద్దర్ని నియమించింది. వారానికోసారి డాక్టర్లు బిజులీ ఆరోగ్యాన్ని చెక్ చేస్తారు. వృద్ధాప్యంలో కూడా బిజులీ తిండి తినటంలో మాత్రం ఏమాత్రం తగ్గదు. ప్రతీ రోజూ మూడు పూటలా భారీగా ఆహారం తీసుకుంటుంది. గజరాజు ఆరోగ్యం ఎలా ఉందో… వారం వారం అప్‌డేట్స్ కోల్‌కతాలోని సంస్థ హెడ్ ఆఫీస్‌కి పంపాల్సిందే. హెడ్ ఆఫీసులు బిజులీ ఆరోగ్య రికార్డులతో పాటు అన్ని వివరాలు భద్రంగా ఉన్నాయి.

బిజులీ గజం 400 కేజీల బరువుంది. రోజూ దీనికి 25 కేజీల రైస్, 25 కేజీల గోధుమలు, గింజలు, మొలాసెస్ వంటివి ఆహారంగా పెడతారు. బిజులీ ప్రసాద్‌కి అరటి కాండాలను చిన్న ముక్కలుగా కోసి పెడతారు. వాటితోపాటూ… విటమిన్లు, పోషకాహారం కూడా ఇస్తున్నారు.

ఈ ఏనుగుకు నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల దాకా ఖర్చవుతుందని టీ ఎస్టేట్ ఉద్యోగి రజిత్ బారువా తెలిపారు. బిజలీ ఆరోగ్యంగా ఉండటానికి దానికి రోజు పెట్టే ఆహారంతో పాటు విటమిన్లు, పోషకాహారం కూడా ఇస్తున్నామని..ఎందుకంటే ఎనిమిదేళ్ల కిందట బిజులీ అనారోగ్యానికి గురైంది. దీంతో పోషకాహారం తప్పని చేశామని తెలిపారు. ప్రస్తుతం బిజులీ ఆరోగ్యంగానే ఉంది. అందుకే వారం వారం హెల్త్ చెకప్ తప్పనిసరి చేస్తున్నామని ఎందుకంటే బిజులి కేవలం ఓ జంతువే కాదు అది మా కుటుంబంలో సభ్యుడు కాబట్టి అని తెలిపారు బారువా.

బిజులీ ప్రసాద్‌ను బోర్గాంగ్ నుంచి బిహాలీ టీ ఎస్టేట్‌కి తెచ్చారు. అక్కడ థామస్ ముర్ము అనే మావటి దీన్ని చూసుకుంటున్నాడు. గత 20నుంచి బిజులీయే తన జీవితం అనీ..దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తన పని అని థామస్ అంటున్నాడు. ఇదివరకు కేరళలో 88 ఏళ్ల ఏనుగు… ఆసియాలో అతి ఎక్కువ వయసున్న ఏనుగుగా ఉండేది. అది చనిపోవడంతో… ఇప్పుడు బిజులీ ఆ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆసియాలోని 25 శాతం ఏనుగులు… ఈశాన్య భారత్‌లో ఉన్నాయి. వాటి సంఖ్యను 10వేల 139గా గుర్తించారు. వాటిలో 5 వేల 719 అసోంలో ఉన్నాయి. 1754 మేఘాలయలో, 1614 అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి.