Zoomకు ధీటుగా Microsoft.. ఒకేసారి స్క్రీన్‌పై 49మందిని చూడొచ్చు

  • Published By: Subhan ,Published On : June 16, 2020 / 10:36 AM IST
Zoomకు ధీటుగా Microsoft.. ఒకేసారి స్క్రీన్‌పై 49మందిని చూడొచ్చు

Microsoft మరిన్ని సేవలు అందించే దిశగా ఒకేసారి వీడియో కాన్ఫిరెన్స్ లో 49మంది వరకూ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. సోమవారం Microsoft కంపెనీకి సంబంధించిన బ్లాగ్ లో ఈ కథనాన్ని రాసుకొచ్చింది. ప్రైవేట్ ఛాట్‍లో 250మంది వరకూ కలుసుకునే వీలు కల్పించిన ZOOM పెయిడ్ సర్వీసులో 500మంది వరకూ మీట్ అవ్వొచ్చని చెప్పింది. 

వీరంతా ఒకేసారి స్క్రీన్ పై కనిపించరు. కానీ, మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసిన ఫీచర్ లో ఒకేసారి 49మందిని చూడొచ్చు. ఇది రెండు వారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. తమ టీంలకు అందిస్తున్న అనేక ఫీచర్లలో ఇదొకటి. వారి లక్ష్యం ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్ ను సపోర్ట్ చేయాలనే అని అంటోంది. స్టూడెంట్లు, ఫ్యాకల్టీ, ఇన్‌స్టిట్యూషనల్ లీడర్స్, టీచర్స్ యాక్టివ్ గా ఉంటూ ఆన్ లైన్ లో క్లాసెస్ జరగాలనుకుంటున్నట్లు చెప్పింది.

ఇలా పెద్ద సంఖ్యలో గ్యాలరీ కనిపిస్తే ఎడ్యుకేషన్ బ్రేక్ అవుట్ అవకుండా ఉంటుంది. చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టకుండా, ఒకేసారి అటెండెన్స్ వేసేందుకు కూడా, విద్యార్థులు చేయ్యెత్తినప్పుడు ఇట్టే తెలుసుకోవచ్చు. 150మిలియన్ మందికి పైగా రిమోట్ లెర్నింగ్ లో పాల్గొంటున్నారు. దాంతో పాటు దీంతో కంట్రోలింగ్ కూడా కుదురుతుంది. అనుకున్న సమయానికి అటెండ్ అయిన వాళ్లకే లింక్ ఓపెన్ అవుతుంది. తర్వాత కంట్రోలింగ్ ద్వారా మిగిలిన వారు రాకుండా అడ్డుకోవచ్చు. 

ఎడ్యుకేషన్ స్పేస్ లో ఫీడ్ బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగానే ఫీచర్లు యాడ్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. టీచర్లు, ఎడ్యుకేషన్ లీడర్లతో పాటు మహమ్మారి రాకముందు టెక్నాలజీకి దూరంగా ఉన్నవాళ్లు కూడా దీనిని ఈజీగా వాడగలుగుతారు. మైక్రోసాఫ్ట్ చేసిన సర్వే ప్రకారం.. 2020-21 విద్యా సంవత్సరంలో చాలా మంది ఆన్ లైన్ క్లాస్ రూంలలోనే చదువుకోవచ్చని తేలింది.