విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో మంత్రి భార్య

ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్‌గా మార్చడం...ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 12:26 PM IST
విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో మంత్రి భార్య

ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్‌గా మార్చడం…ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు

ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్‌గా మార్చడం…ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ, ఉత్కంఠ రాజకీయానికి తెరలేపిన ఆ జెడ్పీ పీఠం ఏ జిల్లాది…ఆ కుటుంబం ఏది.

జెడ్పీ పీఠంపై చిన్నశ్రీను, ఝాన్సీలక్ష్మీ ఆశలు:
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. ఏ సీటులో ఎవరు నిలబడతారన్నది ఉత్కంఠకు దారితీస్తుండగా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ఈ పీఠంపై కూర్చొనే అదృష్టవంతులెవరో అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బొత్స కుటుంబానికే ఈ సీటును ఇస్తారా లేక…వేరొక నేత తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బొత్స కుటుంబానికి ఈ బెర్తు ఖరారు అవుతుందనుకుంటే…మళ్లీ మరో సస్పెన్స్ తలెత్తుతోంది. ఆ కుటుంబం నుంచే ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో ఫైనల్‌గా ఎవరికి దక్కుతుందన్నది మరో డౌట్‌గా మారింది. దీంతో విజయనగరం జెడ్పీ పీఠంపైనే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

జెడ్పీ పీఠంపై బొత్స ఫ్యామిలీ కన్ను:
విజయనగరం జిల్లాలో 2005 తర్వాత జెడ్పీ చైర్మన్‌ పదవికి ప్రాధాన్యత నెలకొంది. అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన బొత్స సత్యనారాయణ… తన సమీప బంధువులనే జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. క్యాబినెట్ హోదా ఉన్న జెడ్పీ పోస్టును అప్పట్లో తన సమీప బంధువు, ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకి అప్పగించారు. ఆ తర్వాత ఆ పదవిని తన భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మికి కట్టబెట్టారు. అప్పటి నుంచి జిల్లాలో జెడ్పీ ఛైర్మన్ పదవి బొత్స కుటుంబంలోనే ఉంటూ వచ్చింది. అయితే, 2014 ఎన్నిలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ఈ పీఠాన్ని దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూరుతు శోభా స్వాతిరాణికి రిజర్వేషన్ కోటా కింద జెడ్పీ ఛైర్‌పర్సన్ పదవి దక్కింది. ఆమె పదవీ కాలం ముగియడం.. ఇప్పుడు జనరల్‌ స్థానం కావడంతో మరోసారి బొత్స కుటుంబం దృష్టి సారించింది. తొలుత ఈ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రిజర్వేషన్ల మార్పులతో జనరల్‌గా మారింది.

రేసులో బొత్స మేనల్లుడు, బొత్స భార్య:
బొత్స మేనల్లుడు చిన్నశ్రీను గాని, బొత్స భార్య ఝాన్సీలక్ష్మికి గాని జడ్పీ సీటును అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. బొత్స ఝాన్సీలక్ష్మి గతంలో జెడ్పీ ఛైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సీటు రాకపోవడంతో బొత్స కుటుంబం కొంత నిరాశకు గురైంది. ఎలాగైనా సరే ఆమెకు ఏదో ఒక పదవి కట్టబెట్టాలన్న ఉద్దేశ్యంతో అప్పటి నుంచి మంత్రి బొత్స పావులు కదుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స ఫ్యామిలీ దృష్టి జెడ్పీ పీఠంపై పడింది. జెడ్పీ బెర్తు తమ చేతిలో ఉంటే…జిల్లాలో చక్రం తిప్పవచ్చన్న నమ్మకంతో ఎప్పటి నుంచో ఆ సీటుపై కన్నేశారు. ఇక బొత్స మేనల్లుడు శ్రీనివాసరావు కూడా జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయనకు ఎస్.కోట సీటు ఆఫర్ వచ్చినా…సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆయన పట్ల సానుకూలంగా ఉంది. అయితే, ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు నేతలు పోటీపడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

జగన్ అత్యంత సన్నిహితుడికి అవకాశం?
మరోపక్క జెడ్పీ సీటుపై బొత్స కుటుంబానికే చెందిన వారు కూర్చొంటారా లేక…కొత్తగా తెరపైకి ఎవరైనా వస్తారా అన్నదానిపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గతంలో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తికి జెడ్పీ పీఠాన్ని కట్టబెడతారన్న టాక్ జోరుగా జరిగింది. అయితే, ప్రస్తుతం అటువంటి సమాచారం ఏమీ లేనప్పటికీ, అధిష్టానం మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు.