గెలుపు ఖాయం : ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ముఖ్యం

అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 11:31 AM IST
గెలుపు ఖాయం : ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ముఖ్యం

అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు

అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు ముఖ్యం  అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనమే గెలవాలని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు, టీడీపీకి నష్టం చేసేందుకు ప్రధాని  మోడీ చెయ్యని ప్రయత్నం లేదన్నారు. టీడీపీకి నష్టం చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. జగన్ కుట్రలకు మోడీ, కేసీఆర్ కుతంత్రాలు  తోడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదని, టీడీపీ గెలుపు ఖాయం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిలో చంద్రబాబు ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం (మే 4,2019) ఉండవల్లిలోని హ్యాపీ రిసార్ట్స్ లో రాజమండ్రి పార్లమెంట్‌  నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50మంది వరకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పోలింగ్‌  సరళి, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎంలలో లోపాలు, అధికారుల వ్యవహారశైలి తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు.

ప్రధాని మోడీ, కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోటాపోటీగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు, మంత్రి పదవులు ఖరారు.. అంటూ వైసీపీ నేతలు హడావుడి చేశారని.. ఇవన్నీ మైండ్ గేమ్ లో అంకాలే అని చంద్రబాబు చెప్పారు. పోలింగ్ శాతాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పథక రచన చేశారని సీఎం ఆరోపించారు. పోలింగ్ రోజున (ఏప్రిల్ 11,2019) ఉదయం 11 గంటలకే తాడిపత్రిలో హత్య, రాజుపాలెంలో స్పీకర్ కోడెలపై దాడి ఇవన్నీ ప్రత్యర్థుల కుట్రలో భాగమే అన్నారు.

ప్రధాని మోడీతో మొదట్లోనే గొడవ పెట్టుకుని ఉంటే రాష్ట్రం ఇంకా నష్టపోయి ఉండేది చంద్రబాబు అన్నారు. ఓపిగ్గా ఎదురుచూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోడీకే వచ్చిందన్నారు. ”రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైమ్” అన్న జగజ్జీవన్ రామ్ సూత్రాన్నే మనం పాటించామని చంద్రబాబు చెప్పారు. అధికారుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నాలు మంచిది కాదని హితవు పలికారు.