Congress On Mallikarjun Kharge: అధ్యక్ష పదవి పోటీలో గాంధీ కుటుంబం ఎవరికీ మద్దతు తెలపట్లేదు: కాంగ్రెస్

 కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘అధికారికంగా పార్టీ అభ్యర్థి అంటూ ఎవరూ లేరు. తాను ప్రత్యేకంగా ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం కూడా ఈ నిర్ణయానికే కట్టుబడి ఉందని సోనియా గాంధీ అన్నారు’’ అని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్‌పర్సన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు.

Congress On Mallikarjun Kharge: అధ్యక్ష పదవి పోటీలో గాంధీ కుటుంబం ఎవరికీ మద్దతు తెలపట్లేదు: కాంగ్రెస్

Congress On Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అధిష్ఠానం మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘అధికారికంగా పార్టీ అభ్యర్థి అంటూ ఎవరూ లేరు. తాను ప్రత్యేకంగా ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం కూడా ఈ నిర్ణయానికే కట్టుబడి ఉందని సోనియా గాంధీ అన్నారు’’ అని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్‌పర్సన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు.

ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తారా? అన్న విషయం గురించి కూడా ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ నిలిచారు. మల్లికార్జున ఖర్గేను గాంధీ కుటుంబమే అనూహ్యంగా పోటీలోకి దింపిందని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా జరగాలని శశి థరూర్ మొదటి నుంచి అంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..