Bengal: నేను మగాడిని.. ED, CBI నన్ను టచ్ చేయొద్దు.. సువేంధుకు TMC నేత వినూత్న కౌంటర్

సెప్టెంబరు 13న రాష్ట్ర సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. వివిధ మార్గాల నుంచి సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల్ని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడంతో బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు రణరంగంగా మారాయి. కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య కొట్లాట సైతం జరిగింది. ఇందులో మినా దేవి పురోహిత్, స్వపన్ దాస్‌గుప్తా అనే నేతలు సహా పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు

Bengal: నేను మగాడిని.. ED, CBI నన్ను టచ్ చేయొద్దు.. సువేంధుకు TMC నేత వినూత్న కౌంటర్

I am male so ED and CBI can not touch me counter by TMC MLA

Bengal: కొద్ది రోజుల క్రితం చేపట్టిన ‘నబన్న ఛలో’ (సచివాలయ ముట్టడి) కార్యక్రమంలో తనను మహిళా పోలీసులు అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారికి తృణమూల్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇడ్రిస్ అలీ వినూత్న రీతిలో కౌంటర్ ఇచ్చారు. సీబీఐ, ఈడీ నా శరీరాన్ని తాకొద్దు. ఎందుకంటే నేను మగాడినంటూ రాసుకున్న కుర్తా ధరించి బీజేపీకి సమాధానం ఇచ్చారు. ఆయన ధరించిన కుర్తాపై ‘‘సీబీఐ, ఈడీ.. నన్ను తాకలేవు. నన్ను తాకొద్దు కూడా. నేను మగాడిని’’ అని రాసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిరసన సందర్భంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన మహిళా పోలీసులతో ‘‘నా దగ్గరికి రాకండి. నన్ను తాకకండి. పురుష పోలీసుల్ని పిలవండి’’ అని సువేంధు అన్నారు. అయితే దీనిపై టీఎంసీ స్పందిస్తూ ‘‘సువేంధును అరెస్ట్ చేయడానికి పురుష పోలీసులు కావాలని అడిగితే అడిగారు. కాని మహిళా పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమేంటి? ఇదేం పద్దతి?’’ అంటూ విమర్శించింది. టీఎంసీ విమర్శల అనంతరం ప్రతి మహిళలో తాను దుర్గా మాతను చూస్తానని, అందుకే పురుష పోలీసుల్ని పిలవాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. సువేంధు వ్యాఖ్యలపై టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ ‘‘స్త్రీలలో దుర్గా మాతను చూస్తామని ఒకవైపు చెప్తూనే.. మరొక వైపు మమతా బెనర్జీపై అసభ్య పదజాలంతో దాడి చేస్తారు’’ అంటూ కౌంటర్ అటాక్ చేశారు.

సెప్టెంబరు 13న రాష్ట్ర సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. వివిధ మార్గాల నుంచి సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల్ని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడంతో బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు రణరంగంగా మారాయి. కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య కొట్లాట సైతం జరిగింది. ఇందులో మినా దేవి పురోహిత్, స్వపన్ దాస్‌గుప్తా అనే నేతలు సహా పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. కోల్‭కతా నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక పాయింట్ల ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ఉపయోగించారు.

Mohan Bhagwat: మసీదును సందర్శించిన RSS చీఫ్.. హిందూ, ముస్లిం DNA ఒకటే అంటూ స్టేట్‭మెంట్!