MK Stalin: జాతీయ రాజకీయాలపై స్టాలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నితీశ్, కేసీఆర్ బాటలో స్టాలిన్?

వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజకీయాలను అమలు చేయలేకపోతున్నదని అన్నారు. అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ ప్రయత్నించనుందని స్టాలిన్‌ అన్నారు

MK Stalin: జాతీయ రాజకీయాలపై స్టాలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నితీశ్, కేసీఆర్ బాటలో స్టాలిన్?

is stalin goes to national politics

MK Stalin: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నితీశేమో విపక్ష పార్టీలను ఏకం చేసి బలమైన కూటమిని నిర్మించే పనిలో ఉండగా.. కేసీఆర్ ఏకంగా జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాలు ఏలాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా, తాజాగా వరుసలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కకూడా చేరబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే ఈ అనుమానాలను రేకిత్తున్నాయి.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‭సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి లోక్‭సభ స్థానాన్ని కూడా గెలుచుకొని దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి జాతీయ స్థాయిలో రాజకీయ శక్తిగా మారనుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అన్నారు. ఆదివారం ఉదయం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో స్టాలిన్‌ సోదరి, ఎంపీ కనిమొళిని డీఎంకే డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు.

ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రసగింస్తూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజకీయాలను అమలు చేయలేకపోతున్నదని అన్నారు. అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ ప్రయత్నించనుందని స్టాలిన్‌ అన్నారు. వచ్చేఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాలలో విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నితీశ్‭లా కూటమి ప్రయత్నాలు కాకపోయినప్పటికీ, కేసీఆర్‭లా జాతీయ పార్టీ ఆలోచన లేనప్పటికీ.. సందర్భం వస్తే మాత్రం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Raja Singh: బీజేపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన రాజాసింగ్.. నాలుగు పేజీల లేఖ విడుదల