Raja Singh: బీజేపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన రాజాసింగ్.. నాలుగు పేజీల లేఖ విడుదల

బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Raja Singh: బీజేపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన రాజాసింగ్.. నాలుగు పేజీల లేఖ విడుదల

Raja Singh: తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎమ్మెల్యే రాజా సింగ్ సమాధానం ఇచ్చారు. ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గత ఆగష్టులో రాజాసింగ్‌ను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Videos of Girls: అమ్మాయిల డామిట్రీలో సీసీ కెమెరా.. దుస్తులు మార్చుకుంటుండగా వీడియో రికార్డు.. యజమానిపై ఫిర్యాదు

దీనిపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆగష్టు 23న షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, రాజా సింగ్ జైల్లో ఉన్నందున దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానాన్ని కోరారు. తాజాగా షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానంగా 4 పేజీల లేఖను పంపారు. ఒక బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, ఎలాంటి పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు పాల్పడలేదని లేఖలో పేర్కొన్నారు. హిందువులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుఖీ షో నిర్వహించారని, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టినట్లు లేఖలో వెల్లడించారు. తనతోపాటు అదే రోజు తెలంగాణ ప్రభుత్వం 500 మందిని అరెస్టు చేసిందని, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి తనపై అక్రమంగా 100 కేసులు పెట్టాయన్నారు.

Girl Drowns: నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అక్క

‘‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ, హిందువులను ఇబ్బంది పెడుతోంది. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్నీ, ఇతర దేవుళ్లను కించపరచలేదు’’ అని రాజా సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.