దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్‌ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 07:49 AM IST
దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్‌ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్‌ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న చెరువుకి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాగు నీటి కష్టాలు తీర్చాలని నినాదాలు చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోకవర్గానికి వచ్చారు.

బుధవారం(మార్చి 6) హిందూపురం నియోజకవర్గం చేరుకున్న బాలయ్య.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లేపాక్షి మండలంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కాన్వాయ్ లో వెళుతుండగా… స్థానిక మహిళలు అడ్డుకున్నారు.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

తాగునీటి కష్టాలు తీర్చాలని మహిళలు డిమాండ్ చేశారు. తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచాక 3 నెలకు, 6 నెలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తే మా సమస్యలు మీకెలా తెలుస్తామని వారు బాలయ్యను నిలదీశారు. మళ్లీ ఎన్నికలు రావడంతో మీకు గుర్తుకు వచ్చామని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కడో ఉంటే మా సమస్యలు మీకెలా తెలుస్తాయని, మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రయోజనం అని మహిళలు ప్రశ్నించారు.
Also Read : విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్

కాన్వాయ్ ని అడ్డుకున్న మహిళలకు బాలయ్య నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తాగునీటి సరఫరా కోసం కాల్వ పనులు స్టార్ట్ చేశామని చెప్పారు. రూ.13 కోట్ల బీటీ రోడ్లు వేస్తున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. గోరంట్ల, చిలమత్తూరు ఎత్తిపోతల పథకం ద్వారా 10 గ్రామాలకు తాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2 నెలల్లో తాగునీటి సమస్యను పరిస్కరిస్తామని బాలయ్య వారికి హామీ ఇచ్చి శాంతిపంజేశారు.
Also Read : పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్