కరోనా ఉంది : వేడుకలు వద్దు..అభిమానులకు మంత్రి హరీష్ విజ్ఞప్తి

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 01:11 AM IST
కరోనా ఉంది : వేడుకలు వద్దు..అభిమానులకు మంత్రి హరీష్ విజ్ఞప్తి

మంత్రి హరీష్ రావు అభిమానులకు, TRS కార్యకర్తలకు, నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు (జూన్ 03వ తేదీ) సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని సూచించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ సారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో మనమంతా స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఙప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఙతలు’ అంటూ ట్వీట్ చేశారు. 

ఆయన బర్త్ డే సందర్భంగా ఎంతో మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయన్ను కలిసి విషెస్ అందిస్తుంటారు. కానీ ఈ ఏడాది కూడా హరీష్ రావు దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు జూన్ 02వ తేదీన హరీష్ రావు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 

హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అని పేరు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు హరీష్. డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతం ఓట్లు హరీష్‌కే పడ్డాయి. లక్ష 20వేల 650 ఓట్ల మెజారిటీతో హరీష్ గెలుపొందారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 5 సార్లు ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కుండా చేసిన ఘనత హరీష్ రావుకే దక్కుతుంది.

 

Read:  తెలంగాణ APPLE..రుచి చూసిన సీఎం కేసీఆర్