నా చెల్లిని చంపుతామన్నా పట్టించుకోరా? ఇన్‌స్టాగ్రామ్‌పై సోనమ్ సీరియస్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కారణంగా బాలీవుడ్ స్టార్ వారసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ని అయితే నెటిజన్లు కొంచెం ఎక్కువగానే ఆట ఆడుకున్నారు. విమర్శలు ఎక్కువవడంతో సోనమ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌ను కంట్రోల్ చేసింది. దీంతో సోనమ్ సోదరి రియా కపూర్ సోషల్ మీడియా ఖాతాలకు బెదిరింపులు వస్తున్నాయి. సోనమ్ సోదరి రియాను చంపేస్తామంటూ ఇటీవల ఓ నెటిజన్ బెదిరించాడు.

ఆ కామెంట్‌ను డిలీట్ చేయాల్సిందిగా రియా ఇన్‌స్టాగ్రామ్ టీమ్‌ను కోరింది. అయితే ఆ కామెంట్ తమ రూల్స్‌కు వ్యతిరేకంగా లేదని, దానిని డిలీట్ చేయడం కుదరదని ఇన్‌స్టాగ్రామ్ నుంచి సమాధానం వచ్చింది. కావాలంటే ఆ వ్యక్తిని బ్లాక్ చేసుకోవాలని సూచించింది. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన రియా.. ‘కచ్చితంగా నేను ఆ వ్యక్తిని బ్లాక్ చేస్తాను. అయితే ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీని సురక్షితంగా ఉంచేందుకు మీరేం చర్యలూ తీసుకోరా’.. అని ప్రశ్నించింది. దీనిపై సోనమ్ స్పందిస్తూ.. ‘చంపేస్తామనే బెదిరింపులు సమంజసమేనని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోందా? లేదా ఇన్‌స్టాగ్రామ్ ఇండియా టీమ్‌కు హిందీ చదవడం రాదా?’ అంటూ కామెంట్ చేసింది. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Sonam Kapoor

Sonam Kapoor

Read:నటి నవ్యకు కరోనా.. షూటింగులో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లో..

Related Posts