Srivari Naivedyam : శ్రీవారికి గోఆధారిత ప్రకృతిసిద్ధ నైవేద్యం, ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి

గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్య కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించారు. గోఆధారిత ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక వాహనాన్ని

Srivari Naivedyam : శ్రీవారికి గోఆధారిత ప్రకృతిసిద్ధ నైవేద్యం, ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి

Srivari Naivedyam

Srivari Naivedyam : గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్య కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించారు. గోఆధారిత ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక వాహనాన్ని శంషాబాద్ లోని శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మూడు నెలల పాటు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సంపూర్ణ నైవేద్యానికి అవసరమైన గోఆధారిత ఉత్పత్తులను యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సమర్పించారు.

ఈ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. ఎలాంటి ఎరువులు, రసాయనాలతో కలుషితం కాకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పండించి సేకరించిన పదార్దాలతోనే స్వామి వారికి నివేదన చేయాలని అద్భుతమైన సంక్పలం చేయడం చాలా మంచి ఆలోచన అన్నారు స్వామీజీ. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనది, శ్రీవారి భక్తులకు ఇదొక శుభ సమాచారం అన్నారు. ఇలాంటి సేవ చేసుకోగలగడం ఒక అదృష్టం అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. కలియుగాంతం వరకు ఈ కార్యక్రమం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.