Tirumala Information : వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతోపాటు.. ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలకు ...

Tirumala Information : వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirumala Temple (Pic Credits _ Google)

Tirumala Tirupati Devasthanams : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతోపాటు.. ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీగా పెరిగింది.

Tirumala Temple (Pic Credits : @TTDevasthanams Twitter)

Tirumala Temple (Pic Credits : @TTDevasthanams Twitter)

తిరుమల తిరుపతి దేవస్థానం వివరాల ప్రకారం.. బుధవారం శ్రీవారిని 72,510 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు.  తిరుమలలో భక్తులు రద్దీ పెరగడంతో.. 12 కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతుంది.