Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బోలెడన్ని పేర్లు .. వాటి అర్థాలు, పరమార్ధాలు

మనస్సు నిండా భక్తితో చిన్న పత్రిని సమర్పిస్తే చాలు కోరిన కోరికల్ని నెరవేర్చే భక్తుల కొంగుబంగారు ఏకదంతుడికి ఎన్నో పేర్లున్నారు. ఏ పేరుతో పిలిచినా పలికే వినాయకుడికి భిన్నమైన పేర్లు ఉన్నాయి. వాటికి అర్థాలున్నాయి.

Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బోలెడన్ని పేర్లు .. వాటి అర్థాలు, పరమార్ధాలు

Lord Ganesha Different Names

Ganesh Chaturthi 2023 : వినాయకుడు,గణేషుడు,విఘ్నేశ్వరుడు,ఏకదంతుడు,లంబోదరుడు, గణనాధుడు.. ఇలా విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల మొరను ఆలకిస్తాడు. భక్తులు భక్తితో చేసే పూజల్ని వీక్షిస్తాడు. మనస్సు నిండా భక్తితో చిన్న పత్రిని సమర్పిస్తే చాలు కోరిన కోరికల్ని నెరవేర్చే భక్తుల కొంగుబంగారు ఏకదంతుడికి ఎన్నో పేర్లున్నారు. ఏ పేరుతో పిలిచినా పలికే వినాయకుడికి భిన్నమైన పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. బొజ్జ గణపయ్యకు ఎన్నో పేర్లున్నాయి. ఆ పేర్లేమిటో.. వాటి అర్థాలను ఈ వినాయక చవితి సందర్బంగా తెలుసుకుందాం..

1. ఏకదంతుడు అంటే ఏక అంటే ఒక్కటి. ఒక్కటే దంతం ఉన్నవాడు అని అర్థం
2. లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
3. విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు అంటే విఘ్నాలను తొలగించే వాడు లేదా ఆటంకాలు ఏర్పడకుండా చూసేవాడు)
4. వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు అంటే గణాలకు నాయకత్వం వహించేవాడు)
5. గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
6. గజాననుడు (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
7. ఓంకారుడు (మంచి జీవితాన్ని ఇచ్చేవాడు)
9. అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
10. అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)

బొజ్జగణపయ్యకున్న మరిన్ని పేర్లు..
1. బాల గణపతి
2. భక్తి గణపతి
3. ధుంధి గణపతి
4. దుర్గా గణపతి
5. ద్విజ గణపతి
6. ద్విముఖ గణపతి
7. ఏకదంత గణపతి
8. ఏకాక్షర గణపతి
9. హరిద్ర గణపతి
10. హీరాంబ గణపతి
11. క్షిప్ర గణపతి
12. క్షిప్ర ప్రసాద గణపతి
13. లక్ష్మీ గణపతి
14. మహా గణపతి
15. నృత్య గణపతి
16. రుణమోచన గణపతి
17. సంకటహర గణపతి
18. శక్తి గణపతి
19. సిద్ధి గణపతి
20. సింహ గణపతి
21. సృష్టి గణపతి
22. తరుణ గణపతి
23. త్రిముఖ గణపతి
24. త్య్రక్షర గణపతి
25. ఉచ్ఛిష్ట గణపతి
26. ఉద్దండ గణపతి
27. ఊర్ధ గణపతి
28. వరద గణపతి
29. విఘ్న గణపతి
30. విజయ గణపతి
31. వీర గణపతి
32. యోగ గణపతి

ఏ పేరుతో పిలిచినా కరుణించే కరుణాస్వభావుడు బొజ్జ గణపయ్య. ఏపేరుతో కొలిచినా.. భక్తులు వినతులను మన్నిస్తాడు విన్నాయకుడు. భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు భక్తి గణపతి. కొంచెం ప్రసాదం పెట్టి ప్రసన్నం చేసుకుంటే వరాలను ప్రసాదిస్తాడు వర గణపతి.