Kunda Satyanarayana: సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉండే సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు

Kunda Satyanarayana: సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత

Kunda Satyanarayana

Kunda Satyanarayana: యాదాద్రికి అత్యంత సమీపంలో విరాజిల్లుతోన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉండే సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు. 85ఏళ్ల వయస్సులో వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై కన్నుమూశారు.

1938 జూన్‌ 15న తేదీన జన్మించిన సత్యనారాణకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్‌, ప్రతాప్‌, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. బుధవారం(12 జనవరి 2022) మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, ఆది దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలు నిర్మించడం సురేంద్రపురిలో ప్రత్యేకత. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. దేవాలయం లోపల హుండీలు కళశాలను పోలి ఉండేలా కళాత్మకంగా తీర్చిదిద్దారు.

ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే, మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కడం జరిగింది. పుట్టమన్నుతో చేసిన శివలింగాలకు అర్చన చేస్తే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం ఇక్కటి అందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు ఉంది. 2009, ఫిబ్రవరి 8న ప్రారంభమైన ‘సురేంద్రపురి’ తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నడుస్తోంది.