ముంబై ఇండియన్స్ గెలవడానికి 5కారణాలివే..

ముంబై ఇండియన్స్ గెలవడానికి 5కారణాలివే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగా అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలో ఏదో ఒక జట్టుతో మే12న హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తలపడనుంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్‌లో చెన్నైను చిత్తు చేసిన ముంబై.. ఫైనల్‌లో గెలిచేందుకు ఉన్న బలాల గురించి ఓ సారి విశ్లేషిస్తే..

ఐపీఎల్ ఫైనల్‌లో గ్రేట్ రికార్డు:
రోహిత్ సేన కెప్టెన్సీలో 2013నుంచి ఆరేళ్లుగా ఐపీఎల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోంది ముంబై ఇండియన్స్. ఇప్పటికే 3ట్రోఫీలను గెలిచేసుకున్న ముంబై 7వ ట్రోఫీ కోసం సిద్ధమైపోతుంది. 2013, 2015, 2017సీజన్లలలో టైటిల్ ముద్దాడిన ముంబైకు సెంటిమెంట్ కలిసొస్తే 2019లోనూ టైటిల్ దక్కుతుంది. ఫైనల్‌కు చేరిన 4సార్లలో 3మ్యాచ్‌లు ముంబైనే గెలిచింది. కానీ, చెన్నై 7సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ గెలిచింది 3మ్యాచ్‌లు మాత్రమే. 

చెన్నైతో పోరులో ముంబైదే పైచేయి:
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో దాదాపు గెలిచేది ముంబై ఇండియన్సే. ఆడిన 27 మ్యాచ్‌లలో చెన్నై 11సార్లు గెలవగా మిగిలిన 16సార్లు ముంబైనే విజయం దక్కించుకుంది. ఒకవేళ ఫైనల్‌ ఈ జట్ల మధ్యనే అయితే ముంబై గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఢిల్లీ కంటే బెటర్:
చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఫైనల్ కోసం పోరాడుతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మరొకటి. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు టోర్నమెంట్‌లో చాలా బాగా ఆడుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఫెయిల్యూర్ జట్టుగా పేరొందిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సీజన్‌కు ఇంత దూరం రావడం చాలా గ్రేట్. ఇక ఆటగాళ్ల పరంగా చూస్తే ముంబై జట్టులో ఢిల్లీ కంటే సమన్వయం బాగా కనిపిస్తోంది. 

ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, పృథ్వీ షాలతో పాటు శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మలు క్యాపబుల్ టీంగా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్‌లో అనుభవమున్న రోహిత్, పొలార్డ్, మలింగలతో పాటు యువ క్రికెటర్లు హార్దిక్, మయాంక్, చాహర్‌లు ఢిల్లీకి ధీటుగా నిలవడంలో నమ్మకంతో కనిపిస్తున్నారు. 

మిడిల్ ఆర్డర్ ఫుల్ ఫామ్:
ముంబై ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్‌కు దిగే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా చక్కటి ఫామ్ లో కనిపిస్తున్నారు. అదే ఢిల్లీ జట్టులో ఫామ్ అప్పుడప్పుడు కనిపిస్తూ మాయమవుతోంది. 

బ్రిలియంట్ బౌలింగ్ అటాక్:
డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయడంలోనూ ముంబై బుమ్రా, లసిత్ మలింగ ఎక్స్‌పెర్ట్‌లు. ఇతరుల మాట అటుంచితే రోహిత్ శర్మ మాయంక్ మార్కండే, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్‌లతో చెన్నై.. ఢిల్లీల టాపార్డర్‌ను కచ్చితంగా తప్పించగలిగేటట్లు కనిపిస్తోంది.