Amit Mishra: గర్ల్‭ఫ్రెండ్‭తో డేట్ కోసం రూ.300 అడిగిన నెటిజెన్.. రూ.500 గూగుల్ పే చేసి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన మాజీ క్రికెటర్

ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Amit Mishra hilariously transfers Rs 500 to a Twitter user who sought money to go on a date with girlfriend

Amit Mishra: సోషల్ మీడియాలో అభిమానులతో ఇతర నెటిజెన్లతో కొంత మంది సెలెబ్రిటీలు సరదాగా ఉంటారు. ఇందులో మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఒకరు. జోకులతో, ఆసక్తికరమైన విశయాలతో తన ఫాలోవర్స్‭ని ఎప్పటికప్పుడు వినోదాన్ని అందిస్తుంటాడు మిశ్రా. అయితే తాజాగా ఒక నెటిజెన్ డబ్బులు అడిగితే వెంటనే రెస్పాండ్ అయి.. డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు పంపించాడు. డబ్బులు తీసుకున్న ఆ నెటిజెనే కాకుండా మిగతా వారిలో కూడా ఈ వార్త కాస్త ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు కాస్త క్యూరియాసిటీని పెంచింది.

ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kamakhya Devi : జననాంగాన్ని పూజించే ఆలయం .. నెలలో మూడుసార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యదేవి పుణ్యక్షేత్రం