Indian Cricketer Ashwin: కెప్టెన్ రోహిత్‌శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అలాచేయడం సరికాదంటూ ..

టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాడు ఔట్ అయినప్పుడు ఔట్‌గా ప్రకటించడం అపైర్ విధి అంటూ రోహిత్ తీరును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Indian Cricketer Ashwin: కెప్టెన్ రోహిత్‌శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అలాచేయడం సరికాదంటూ ..

Indian Cricketer Ashwin

Indian Cricketer Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాడు ఔట్ అయినప్పుడు ఔట్‌గా ప్రకటించడం అపైర్ విధి అంటూ రోహిత్ తీరును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మూడో వన్డే నేడు జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ మొదటి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

India vs sri lanka 2nd ODI: రెండో వ‌న్డేలోనూ భార‌త్‌దే విజ‌యం.. సిరీస్ కైవ‌సం.. ఫొటో గ్యాల‌రీ

మొదటి వన్డేలో భాగంగా శ్రీలంక జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో కోహ్లి 113 పరుగులు చేశాడు. శ్రీలంక జట్టు నుంచి కెప్టెన్ దాసున్ షనకా 108 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. ఈ మ్యాచ్ లో భాగంగా షనకా 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో మహ్మద్ షమీ బౌలింగ్ వేస్తున్నాడు. నాన్ స్ట్రైక్‌లో షనకా ఉన్నాడు. షమీ తనచేతిలోనుంచి బాల్ వదలకముందే షనకా క్రిజ్ దాటి కొద్దిదూరం వెళ్లిపోయాడు. దీనిని గమనించిన షమీ బాల్ వేయకుండా వెనక్కు తిరిగి వికెట్లకు కొట్టాడు. వెంటనే అంపైర్ కు అపీల్ చేశాడు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల్పించుకొని ఆ అపీల్‌ను ఉపసంహరించుకున్నాడు. దీంతో షనక ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత సెంచరీ చేశాడు.

Ind Vs SL 1st ODI : శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ విజయం, చివర్లో సెంచరీతో చెలరేగిన శనక

అయితే, రోహిత్ శర్మ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీమిండియా స్పిన్నర్ రవింద్ర అశ్విన్ ప్రస్తావించాడు. ఆ సమయంలో రోహిత్ నిర్ణయం సరైంది కాదంటూ తప్పుబట్టాడు. ప్రస్తుత క్రికెట్‌లో నాన్‌ స్ట్రైకర్‌ రనౌట్ చేయడం తప్పేమీ కాదు. ఒకవేళ ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్ సమయంలో కెప్టెన్ నిర్ణయంతో చెక్ చేయాల్సిన అవసరం లేదు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్‌ బచ్చన్‌లా కెప్టెన్‌తో అంపైర్ మీరు కచ్చితంగా ఉన్నారా అని అడగరు. బౌలర్ అప్పీలుచేస్తే అది ఔట్ అయితే అంపైర్ దానిని ఔట్‌గా పరిగణిస్తాడు. ఫీల్డర్ అప్పీలు చేసినా అంపైర్ నిర్ణయం తీసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు.