Asia Cup Opening Ceremony : ఆసియా క‌ప్ ప్రారంభ‌ వేడుక‌.. పాట పాడిన పాకిస్తాన్ గాయ‌నీ.. నెట్టింట మీమ్ ఫెస్ట్‌

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup ) నేడు (బుధ‌వారం ఆగ‌స్టు 30న‌) ముల్తాన్ వేదికగా ప్రారంభ‌మైంది.

Asia Cup Opening Ceremony : ఆసియా క‌ప్ ప్రారంభ‌ వేడుక‌.. పాట పాడిన పాకిస్తాన్ గాయ‌నీ.. నెట్టింట మీమ్ ఫెస్ట్‌

Asia Cup Opening Ceremony

Asia Cup Opening Ceremony : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup ) నేడు (బుధ‌వారం ఆగ‌స్టు 30న‌) ముల్తాన్ వేదికగా ప్రారంభ‌మైంది. మొద‌టి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌తో నేపాల్ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. కాగా.. మ్యాచ్‌కు ముందు టోర్నీ ఆరంభ వేడుక‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్వ‌హించింది. 15 నిమిషాల పాటు సాగిన ఈ వేడుక‌లో పాకిస్తానీ గాయని ఐమా బేగ్, నేపాల్‌కు చెందిన త్రిషాలా గురుంగ్ పాల్గొని ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

Praggnanandhaa: స్వదేశానికి చేరుకున్న యువ గ్రాండ్‌ మాస్టర్ ప్రజ్ఞానందకు ఘన స్వాగతం ..

కాగా.. ప్రారంభ వేడుక‌ల‌ను చాలా సాదాసీదగా నిర్వ‌హించ‌డం ప‌ట్ల పాకిస్తాన్ అభిమానులు తీవ్ర నిరాశ‌ను వ్య‌క్తం చేశారు. పాక్ క్రికెట్ బోర్డుపై మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆరంభ వేడుక‌, మొద‌టి మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు వ‌స్తార‌ని భావించిన పీసీబీకి చుక్కెదురైంది. 30వేల కెపాసిటీ ఉన్న స్టేడియంలో క‌నీసం వందల సంఖ్య‌లోనే ప్రేక్ష‌కులు హాజ‌రుఅయ్యారు. స్టాండ్స్ అన్నీ ఖాళీగా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఇక ఓపెనింగ్ వేడుకలో పాకిస్థానీ గాయని ఐమా బేగ్ పాడిన పాట‌ల‌ను విన్న త‌రువాత నెట్టింట మీమ్ ఫెస్ట్ ప్రారంభ‌మైంది.

Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!