INDvAUS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

INDvAUS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా రెండో వన్డేను నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డే విజయాన్ని కొనసాగించాలనే క్రమంలో టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది.  ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. 

టాస్ గెలిచినా కోహ్లీ బ్యాటింగే చేయాలనే అనుకున్నాడట. సాయంత్రానికి బౌలింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావించినట్లు టాస్ అనంతరం మాట్లాడుతూ కోహ్లీ తెలిపాడు. పెద్దగా బౌన్స్ అవుతుందనుకోవడం లేదని, తొలి వన్డే ఫలితాన్ని కొనసాగిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. టాపార్డర్ కుదురుకుంటుందని, టీమిండియా అవకాశాల కోసం చూస్తుందని తప్పకుండా బాగా రాణిస్తారనే విశ్వాసాన్ని కనబరిచాడు. 
Also Read : INDvAUS: తొలి ఓవర్.. తొలి వికెట్.. సున్నా స్కోరు

టాస్ గెలిచి మీడియాతో మాట్లాడిన ఫించ్.. ‘వెలుతురు ఉన్న సమయంలోనే టీమిండియాపై స్పిన్ ప్రయోగించాలనుకుంటున్నాం. తొలి వన్డేలో మా బెస్ట్ ఆట చూపించలేకపోయాం. ధోనీ.. జాదవ్ లు బాగా ఆడారని ఒప్పుకుంటాం. బ్యాటింగ్.. బౌలింగ్ లో మార్పులు జట్టుకు సాయపడతాయని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా జట్టులో రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. షాన్ మార్ష్‌ను, నాథన్ లయన్‌ను మరో సారి జట్టులోకి తీసుకున్నాం. ఇద్దరు స్పిన్నర్లు టర్నర్, బహ్రెండార్ఫ్‌లతో బరిలోకి దిగుతున్నాం’ అని తెలిపాడు. 

2012 నుంచి విదర్భ వేదికగా చేధనకు దిగిన జట్టే గెలుపొందుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
Also Read : INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

టీమిండియా: 
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, బుమ్రా

ఆస్ట్రేలియా: 
ఖవాజా, ఫించ్, స్టోనిస్, హ్యాండ్స్‌కాంబ్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, అలెక్స్ క్యారీ, కౌంటర్ నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా, లైన్