Shaheen Shah Afridi Wedding: షాహీన్ అఫ్రిదీ పెళ్లిలో పాక్ కెప్టెన్ బాబర్ సందడి.. బిగ్ హగ్‌తో స్వాగతం.. వీడియోలు వైరల్

షాహీన్ షా అఫ్రిది పెళ్లిలో బాబర్, షాహీన్ కలిసిమెలిసి ఉండటంతో పాక్ మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేశారు.

Shaheen Shah Afridi Wedding: షాహీన్ అఫ్రిదీ పెళ్లిలో పాక్ కెప్టెన్ బాబర్ సందడి.. బిగ్ హగ్‌తో స్వాగతం.. వీడియోలు వైరల్

Shaheen Shah Afridi Marrige

Updated On : September 20, 2023 / 11:50 AM IST

Shaheen Shah Afridi and Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రీదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ రెండో కుమార్తె అన్షాలను వివాహమాడాడు. వీరి పెళ్లి వేడుక మంగళవారం రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజం కనిపించాడు. పెళ్లి వేడుకకు బాబర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బాబర్‌ను చూసిన షాహీద్ షా అఫ్రీది బిగ్ హగ్‌తో స్వాగతం పలికాడు.

Read Also: Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ

ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. సూపర్ -4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూంలో పాక్ క్రికెటర్ల మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కెప్టెన్ బాబర్ కొందరు క్రికెటర్లను మందలిస్తూ వ్యాఖ్యలు చేయగా.. షాహీన్ షా అఫ్రిది అడ్డుతగిలి బాబర్‌ను నిలదీసినట్లు.. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Read Also : Virat Kohli: తన ఫేవరెట్ సింగర్ శుభ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన విరాట్ కోహ్లీ.. అసలు కారణం అదేనట..

షాహీన్ షా అఫ్రిది పెళ్లిలో బాబర్, షాహీన్ కలిసిమెలిసి ఉండటంతో పాక్ మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేశారు. షాహీన్ తో దిగిన ఫొటోను బాబర్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు. ఇదిలాఉంటే షాహీన్ అఫ్రిది, అన్షాల మొదటి వివాహం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే జరిగింది. దీంతో తాజాగా మరోసారి వారు సన్నిహితులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.