BAN vs NZ : ఔటైన బ్యాట‌ర్‌ను వెన‌క్కి పిలిచారు.. మ‌రోసారి నెట్టింట మ‌న్క‌డింగ్ ర‌చ్చ‌

తాజాగా బంగ్లాదేశ్ జ‌ట్టు కివీస్ బ్యాట‌ర్‌ను మ‌న్క‌డింగ్ ద్వారా ఔట్ చేసింది. దీంతో నెట్టింట మ‌రోసారి మ‌న్క‌డింగ్ అంశం వైర‌ల్ అవుతోంది.

BAN vs NZ : ఔటైన బ్యాట‌ర్‌ను వెన‌క్కి పిలిచారు.. మ‌రోసారి నెట్టింట మ‌న్క‌డింగ్ ర‌చ్చ‌

BAN vs NZ

Bangladesh vs New Zealand : మ‌న్క‌డింగ్‌.. కొంద‌రు దాన్ని త‌ప్పు అని అంటే మ‌రికొంద‌రు మాత్రం కాదు క‌రెక్ట్ అని అంటారు. ఎవ్వ‌రు ఎమ‌న్నా స‌రే ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం అయితే దాన్ని ఔట్ గానే ప‌రిగ‌నిస్తారు. అయితే.. తాజాగా బంగ్లాదేశ్ జ‌ట్టు కివీస్ బ్యాట‌ర్‌ను మ‌న్క‌డింగ్ ద్వారా ఔట్ చేసింది. దీంతో బ్యాట‌ర్ నిరాశ‌గా పెవిలియ‌న్ వైపు వెలుతుండ‌గా అత‌డిని వెన‌క్కి పిలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ త‌మ అప్పీల్‌ను ఉప‌సంహ‌రించుకున్నాడు. దీంతో నెట్టింట మ‌రోసారి మ‌న్క‌డింగ్ అంశం వైర‌ల్ అవుతోంది.

ఏం జ‌రిగిందంటే..?

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జ‌ట్లు ఢాకా వేదిక‌గా రెండో వ‌న్డేలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్ 46వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హ‌స‌న్ మ‌హ్మ‌ద్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న సోధిని ర‌నౌట్ చేశాడు. బంగ్లా ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా అంపైర్ థ‌ర్డ్ అంపైర్‌కు నివేదించ‌గా.. ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో నిరాశ‌తో సోధి పెవిలియ‌న్‌కు వెలుతుండ‌గా.. బంగ్లాదేశ్ లిట‌న్ దాస్‌, బౌల‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ అత‌డిని వెన‌క్కి పిలిచారు.

వారు అంపైర్‌తో మాట్లాడి ర‌నౌట్ అప్పీల్‌ను వెన‌క్కి తీసుకున్నారు. దీంతో సోధి బౌల‌ర్‌ను హ‌స‌న్ మ‌హ‌మూద్‌ను ఆనందంతో కౌగిలించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. మ‌రోసారి మ‌న్క‌డింగ్ అంశం వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.2 ఓవ‌ర్ల‌లో 254 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (68), హెన్రీ నికోల్స్ (49)ల‌తో పాటు ఇష్ సోది (35) రాణించారు.

మన్కడింగ్ అనే పేరు ఎలా వ‌చ్చిందంటే..?

క్రికెట్ నిబంధ‌న 41.16 ప్రకారం.. బౌల‌ర్ బంతిని వేసే స‌మ‌యంలో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళిన‌ప్పుడు బౌలర్ అత‌డిని ర‌నౌట్ చేయ‌టాన్ని మ‌న్క‌డింగ్ ఔట్‌గా పిలుస్తారు. 1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది.

MS Dhoni : ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు దిగ్గ‌జాలు.. ధోనీ, మోహ‌న్‌లాల్‌.. పిక్ వైర‌ల్‌