BCCI Age Detection : ఆటగాళ్ల వయస్సును కొలిచే కొత్త సాఫ్ట్‌వేర్.. క్షణాల్లోనే పసిగట్టేస్తుంది.. బీసీసీఐ ఇదే వాడనుంది..!

యువ క్రికెటర్ల వయస్సులో తేడా ఉండదిక.. కచ్చితమైన వయస్సు ఇట్టి తెలిసిపోతుంది. తప్పుగా చెప్పినా.. దాచిపెట్టినా అసలు వయస్సు ఏంటో ఈ కొత్త సాఫ్ట్ వేర్ పసిగట్టేస్తుంది.

BCCI Age Detection : ఆటగాళ్ల వయస్సును కొలిచే కొత్త సాఫ్ట్‌వేర్.. క్షణాల్లోనే పసిగట్టేస్తుంది.. బీసీసీఐ ఇదే వాడనుంది..!

Bcci Aims To Cut Costs By 80 Percent Using New Software On Age Detection

BCCI Age Detection : యువ క్రికెటర్ల వయస్సులో తేడా ఉండదిక.. కచ్చితమైన వయస్సు ఇట్టి తెలిసిపోతుంది. తప్పుగా చెప్పినా.. దాచిపెట్టినా అసలు వయస్సు ఏంటో ఈ కొత్త సాఫ్ట్ వేర్ పసిగట్టేస్తుంది. ఇకపై తప్పుడు ధ్రవపత్రాలు ఇచ్చినా వెంటనే దొరికిపోతారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలకు తావులేకుండా బీసీసీఐ పక్కా ప్లానింగ్‌తో ఈ కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఆటగాళ్ల వాస్తవ వయస్సును కచ్చితంగా నిర్ధారించవచ్చు. దీనిద్వారా బీసీసీఐకి 80శాతం అదనపు ఖర్చు తగ్గనుంది. అసలు ఎందుకు ఈ ఏజ్ డిటెక్షన్ సాఫ్ట్ వేర్ అవసరమంటే.. ఆటగాళ్ల వయస్సును నిర్ధారించేందుకు.. ఇప్పటివరకూ అండర్-19 ప్రపంచకప్ లేదా జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీల తర్వాత చాలామంది యువ క్రికెటర్లపై వయస్సు మీదనే ఆరోపణలు వస్తుంటాయి. తప్పుడు దృవ పత్రాలను సమర్పించి టోర్నీలో చోటు దక్కించుకున్నారంటూ ఆరోపణలు వస్తుంటాయి. టోర్నీలో చోటు సంపాదించేందుకు ఇలాంటి తరహా మోసాలను మొదట్లోనే అదుపు చేసేందుకు బీసీసీఐ ఈ దిశగా చర్యలు చేపట్టింది. క్రికెటర్ల వాస్తవ వయసును కచ్చితంగా అంచనా వేయగలిగే ఈ సాఫ్ట్ వేర్‌ను బీసీసీఐ వాడనుంది.

ప్రస్తుతం యువ క్రికెటర్ల వయసును కొలిచేందుకు బీసీసీఐ TW3 విధానాన్ని వాడుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ఎడమచేతి మణికట్టును ఎక్స్‌రే తీస్తారు. తద్వారా వయసును నిర్ధారించడం వీలు అవుతుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు రూ. 2,400 (ఒక్కొక్కరికి) వరకు ఉంటుంది. దీనికి సంబంధించి రిపోర్ట్ రావాలంటే మాత్రం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. బీసీసీఐ వాడనున్న BoneXpert Software ద్వారా క్షణాల్లోనే వయసును నిర్ధారించవచ్చు. అలాగే దీనికి అయ్యే ఖర్చు రూ. 288 మాత్రమేనట. TW3తో కన్నా కొత్త ప్రక్రియ ద్వారా బీసీసీఐకి 80 శాతం ఖర్చు తగ్గనుంది.

Bcci Aims To Cut Costs By 80 Percent Using New Software On Age Detection (1)

Bcci Aims To Cut Costs By 80 Percent Using New Software On Age Detection

క్రికెటర్ల వయసును నిర్దారించాలంటే.. ముందుగా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు ఆధ్వర్యంలో ఎక్స్‌రే సెంటర్లలో బీసీసీఐకి చెందిన అధికారి సమక్షంలో పరీక్షలు జరిపేవారు. ముంబైలో బీసీసీఐ ఏవీపీ డిపార్ట్‌మెంట్‌కు పంపిస్తారు. ఏవీపీ విభాగం దానిని ఇద్దరు రేడియాలజిస్టులతో కూడిన బృందానికి పంపుతుంది. రేడియాలజిస్టులు ఆ శాంపిల్స్‌ను పరీక్ష చేసి 4 రోజుల తర్వాత టెస్టు రిజల్ట్స్ వెల్లడిస్తారు. వివిధ అసోసియేషిన్ల నుంచి పంపిన శాంపిల్స్ అన్నీ పరీక్షించిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ఇది దాదాపు రెండు నెలల సమయమైనా పట్టవచ్చు. కాలమే కాదు.. ఖర్చు కూడా అధికమే.. ఫలితంగా బీసీసీఐకి అదనపు భారంగా మారింది. అందుకే బోర్డు పెద్దలందరకూ కలిసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

గతంలో అండర్-19 ప్రపంచకప్‌లో పలువురు క్రికెటర్ల వయసుపై ఆరోపణలు వచ్చాయి. తక్కువగా వయస్సు చూపించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 2019 జూన్‌లో జమ్మూకశ్మీర్ ఆటగాడు రసిక్ ఆలం, ఐపీఎల్‌లో కేకేఆర్, ఢిల్లీ తరఫున ఆడిన మనోజ్ కర్ల, అంకిత్ బావ్నే, ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో రాజవర్ధన్ హంగర్గేకర్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బీసీసీఐ అమలు చేయనున్న ఈ కొత్త సాఫ్ట్ వేర్ తో ఎంతవరకూ వయస్సు సంబంధిత మోసాలు ఆగుతాయో లేదో వేచి చూడాల్సిందే.

Read Also : BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు