TATA IPL: బీసీసీఐకి అదనంగా రూ.130కోట్లు లాభం

ఐపీఎల్ టోర్నీకి వీవో స్థానంలో టాటా స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ టాటాకే అవకాశం ఇచ్చింది బీసీసీఐ.

TATA IPL: బీసీసీఐకి అదనంగా రూ.130కోట్లు లాభం

Vivo Ipl

TATA IPL: ఐపీఎల్ టోర్నీకి వీవో స్థానంలో టాటా స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ టాటాకే అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఇదిలా ఉంటే స్పాన్సర్ మారడంతో బీసీసీఐకే అదనంగా లాభం వచ్చింది. దాదాపు రూ.130కోట్లు అదనంగా లాభం వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుత స్పాన్సర్‌షిప్ 2024వరకే వర్తిస్తుండగా.. ఆ తర్వాత 2024-28 స్పాన్సర్ చేసేందుకు గానూ టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. టాటా గ్రూప్ ఆ తర్వాత ఐదేళ్ల కాంటాక్ట్ కోసం ప్రయత్నించే క్రమంలో బీసీసీఐ టాటాకు రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఇవ్వనుంది.

ఇది చదవండి : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..

కొత్త స్పాన్సర్‌గా టాటా:
ఈ మెగా టోర్నీకి కొత్త స్పాన్సర్ టాటా రావడంతో 2022 ఐపీఎల్ టైటిల్ ముందు టాటా ఐపీఎల్ గా మారనుంది. దీంతో 2016లో స్టార్ట్ అయిన వీవో ఐపీఎల్ మరోసారి మెగా టోర్నీ స్పాన్సర్ షిప్ కు దూరం కానుంది. 2020లో మాత్రమే Dream 11 స్పాన్సర్ కాగా Vivo చివరి సారిగా 439.8కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

దీనిపై రెస్పాండ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ మంగళవారం స్పాన్సర్ షిప్ విషయాన్ని కన్ఫమ్ చేశారు. ‘అవును టైటిల్ స్పాన్సర్ గా Vivo స్థానాన్ని TATA భర్తీ చేయనుందని’ అన్నారు పటేల్.

ఇది కూడా చదవండి: రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్‌లో కూడా

స్పాన్సర్‌షిప్ డీల్‌లో వీవోకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో మెయిన్ స్పాన్సర్ గా టాటానే ఉండబోతుంది.

ఐపీఎల్ లో ఈ ఏడాది రెండు కొత్త టీంలు చేరనున్నాయి. అహ్మదాబాద్ జట్టు, లక్నో జట్లను చేర్చుకోవడానికి బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఐపీఎల్ మెగా వేలం జరగడానికి ముందే ప్రధాన ఏర్పాట్లన్నింటినీ జట్టు పూర్తి చేసుకుంటున్నాయి.