Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్‌కు పితృ వియోగం

టీమిండియా సీనియర్ బౌలర్, సన్​రైజర్స్ హైదరాబాద్​ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్​ గురువారం కన్నుమూశారు. 63ఏళ్ల ఆయన క్యాన్సర్​తో కొన్నిరోజులుగా పోరాడుతున్నారు.

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్‌కు పితృ వియోగం

Bhuvaneshwar Kumar

Bhuvneshwar Kumar: టీమిండియా సీనియర్ బౌలర్, సన్​రైజర్స్ హైదరాబాద్​ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్​ గురువారం కన్నుమూశారు. 63ఏళ్ల ఆయన క్యాన్సర్​తో కొన్నిరోజులుగా పోరాడుతున్నారు.

గురువారం మీరట్‌లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే తుది శ్వాస విడిచారు. కిరణ్​పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్​లో పోలీస్​ శాఖలో సబ్​ ఇన్​స్పెక్టర్‌గా​ పనిచేసి.. కొన్నేళ్ల క్రితం రిటైరయ్యారు.

అరుదైన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు జాండీస్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎదుర్కోలేకపోయారు. టీమిండియా క్రికెటర్ల కుటుంబాల్లో వరుస విషాదాలు వినిపిస్తున్నాయి. ఆర్పీసింగ్, పీయూష్ చావ్లా, వేదా కృష్ణమూర్తి, ప్రియా పునియా ఇళ్లల్లో కరోనా వైరస్ ప్రభావంతో శోకం చోటు చేసుకుంది.

ఐపీఎల్ 2021 సీజన్ లో గాయపడి 2మ్యాచ్ లకు దూరమైన భువీ.. ఇంగ్లండ్ పర్యటనకు ప్రకటించిన బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ లో మంచి రికార్డు ఉన్న భువీని ఎంపిక చేయకపోవడంతో టెస్ట్ ఫార్మాట్ ఇష్టం లేదంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

వీటిపై క్లారిటీ ఇచ్చిన భువీ.. మూడు ఫార్మాట్లలో ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. జులైలో శ్రీలంకలో పర్యటించే జట్టులో అతడు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. భువీ తండ్రి మృతి పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ సంతాపం ప్రకటించింది.