Actress Married Cricketers: క్రికెటర్లతో లైఫ్ షేర్ చేసుకున్న హీరోయిన్లు

చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయాణం సాగించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లారు.

Actress Married Cricketers: క్రికెటర్లతో లైఫ్ షేర్ చేసుకున్న హీరోయిన్లు

Cricket Bollywood

Actress Married Cricketers: చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయాణం సాగించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లారు. ఈ పద్ధతి ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న సంప్రదాయం ఇది.

అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ
నాలుగేళ్ల ప్రేమాయాణం తర్వాత 2017 డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నారు విరుష్కా జోడి.

హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్
పాండ్యా వల్లనే లైమ్ లైట్ దక్కించుకుంది నటాషా. వీరి బంధం పెళ్లి వరకూ వెళ్లకపోయినా నిశ్చితార్థం ముగించుకుని ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు.

మొహసీన్ – రీనా
పాకిస్తాన్ క్రికెటర్ మొహసీన్ ఖాన్, బాలీవుడ్ నటి రీనా రాయ్ ప్రేమించుకుని ఒకటయ్యారు. కానీ, వారి వివాహ బంధం సజావుగా సాగకపోవడంతో విడాకులు తీసుకున్నారు.

సంగీత – అజారుద్దీన్
1980లలో మిస్ ఇండియా అయిన సంగీతా బిజ్లానీతో చాలా కాలం డేటింగ్ చేసిన అజారుద్దీన్ 1996లో పెళ్లి చేసుకున్నాడు.

జహీర్ ఖాన్ – సాగరిక
బాలీవుడ్ నటి సాగరిక జహీర్ తో ప్రేమలో ఉండి సినిమాల్లో కనిపించింది. కానీ, ఆ తర్వాత తనకు తానే సినిమాల్లో నుంచి తప్పుకుంది. జహీర్ కూడా టీవీల్లో రాణించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

యువరాజ్ – హెజెల్ కీచ్
సల్మాన్ ఖాన్ సినిమా బాడీగార్డ్ లో కనిపించిన హెజెల్.. యువరాజ్ ను పెళ్లాడి సినిమాలకు దూరం అయింది.

హర్భజన్ – గీతా బస్రా
ఇమ్రాన్ హష్మీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గీతా.. 4సినిమాలు మాత్రమే చేసింది. హర్భజన్ తో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రాణించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది.

ఫొటో స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..