Viral Video: పరిగెత్తుకుంటూ వచ్చి అంపైర్ ప్యాంట్ లాగిన బౌలర్.. ఆ తర్వాత రియాక్షన్ ఏంటంటే?
స్టన్ క్రికెట్ క్లబ్‌లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్‌అప్‌కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్‌అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. అనంతరం సదరు బౌలర్ అక్కడి నుంచి నవ్వుతూ పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్లి ''ఇట్స్ ప్రాంక్'' అంటూ అంపైర్‌కు క్షమాపణ చెప్పాడు. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు ముందు ఏం అర్థం కాలేదు

bowler tracks umpire pant during amid cricket match
Viral Video: ఆటలో అన్ని సమయాలు సీరియస్‌గానే ఉండవు. కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. తోటి ఆటగాళ్లతోనో కోచ్‌లతో ఆటపట్టించే చేష్టలు మైదానంలో బాగానే జరుగుతుంటాయి. కానీ, ఎవరూ అంసైర్ల జోలికి మాత్రం వెళ్లరు. అలాంటిది ఒక ఆటగాడు మ్యాచ్ కొనసాగుతుంగా అంపైర్ ప్యాంట్ లాగాడు. బౌలింగ్ వేయడానికి పరుగెత్తుకుంటూ వచ్చిన అతడు బాల్ వేయడం మానేసి అంపైర్ ప్యాంట్ లాగి పరిగెత్తాడు. లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం క్రికెట్ అభిమానులనే కాకుండా క్రిడాభిమానుల మధ్య వైరల్ అవుతోంది.
రిస్టన్ క్రికెట్ క్లబ్‌లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్‌అప్‌కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్‌అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. అనంతరం సదరు బౌలర్ అక్కడి నుంచి నవ్వుతూ పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్లి ”ఇట్స్ ప్రాంక్” అంటూ అంపైర్‌కు క్షమాపణ చెప్పాడు. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు ముందు ఏం అర్థం కాలేదు. కానీ అంపైర్ ప్యాంట్ ఊడిపోయిన విషయం తెలిసి కాసేపు నవ్వుకున్నారు. అయితే తన ప్యాంటు లాగడంపై అంపైర్ సీరియస్ కాకుండా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నిజంగా మైదానంలో స్పోర్టివ్ అంటే ఇదేనని ఆయన నిరూపించారు. కానీ, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అందరూ ఆ అంపైర్‌లా స్పోర్టీవ్‌గా ఉండరు. తేడా వస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు.
@ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. ??? pic.twitter.com/oF2qWeZbXk
— Tino Hallerenko (@tinohalleron) August 27, 2022