Brett Lee Praises Kohli: కోహ్లీకి ఆ సెంచరీ చేయడానికి అందుకే మూడేళ్లు పట్టింది..! విరాట్‌ గురించి బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు ..

కోహ్లీ గురించి ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు వచ్చిన బెట్ లీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని మించినోడు ఈ భూ ప్రపంచంలోనే లేడని, కోహ్లి లాంటి ఆటగాడు తరానికొక్కరు పుడతారని ప్రశంసించాడు.

Brett Lee Praises Kohli: కోహ్లీకి ఆ సెంచరీ చేయడానికి అందుకే మూడేళ్లు పట్టింది..! విరాట్‌ గురించి బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు ..

Brett Lee Praises Kohli

Brett Lee Praises Kohli: కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ లో ఆప్ఘానిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో అలవోకగా సెంచరీ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే కోహ్లీ తన 71వ సెంచరీ కోసం దాదాపు మూడేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఫామ్ కోల్పోయి పలు టోర్నీలకు టీమిండియా జట్టు ఎంపికలో చోటుసైతం కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో సెంచరీతో కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావటంతో పలువు మాజీ, తాజా క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Virat Kohli: విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వను.. బాగా ఆడటంపైనే దృష్టి పెడతా: విరాట్ కోహ్లీ

కోహ్లీ గురించి తాజాగా ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు భారత్ కు వచ్చిన బెట్ లీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని మించినోడు ఈ భూప్రపంచంలోనే లేడని, కోహ్లి లాంటి ఆటగాడు తరానికొక్కరు పుడతారని ప్రశంసించాడు. సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారా, జాక్ కలిస్ లాంటి వారు క్రికెట్ లో ఆణిముత్యాలని, అలాంటి వారిలో కోహ్లీ ఒకడంటూ కొనియాడాడు. కోహ్లీకి నేను వీరాభిమానిని అంటూ బెట్ లీ పేర్కొన్నాడు.

Virender Sehwag criticises Kohli and co: కోహ్లీతో పాటు ఇతర భారత క్రికెటర్లపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు

కోహ్లీ ఫామ్ పై మాట్లాడుతూ.. ఎంత గొప్ప క్రికెటర్ అయినా ప్రతీ మ్యాచ్ లో సెంచరీ కొట్టాలంటే సాధ్యం కాదని, అలా కొట్టాలని ఆశించడం అత్యాశే అవుతుందని బెట్ లీ అన్నాడు. కోహ్లీ మూడేళ్లకుపైగా సెంచరీ చేయకపోవటానికి అతనిపై తీవ్ర ఒత్తిడే కారణమని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కోహ్లీ ప్రతీ మ్యాచ్ లో సెంచరీ చేయాలని కోరుకోవటం తప్పులేదని, కానీ కోహ్లీ వారు ఆశించిన స్థాయిలో రాణించే క్రమంలో ఒత్తిడికి లోను కావటం వల్లనే తాజా సెంచరీకోసం ఇన్నేళ్లు పట్టిందని అన్నాడు. కోహ్లీని ప్రతి మ్యాచ్ కు ముందు భూతద్దంలో చూడటం మానేసి స్వేచ్చగా క్రికెట్ ఆడేందుకు అవకాశం కల్పించాలని బ్రెట్ లీ అన్నాడు. అదేవిధంగా బ్రెట్ లీ సచిన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సచిన్ కు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే అస్సలు నచ్చేది కాదని అన్నాడు.