Virat Kohli: విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వను.. బాగా ఆడటంపైనే దృష్టి పెడతా: విరాట్ కోహ్లీ

విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేనని వెల్లడించారు.

Virat Kohli: విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వను.. బాగా ఆడటంపైనే దృష్టి పెడతా: విరాట్ కోహ్లీ

Virat Kohli: విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వబోనని, వాటిని పట్టించుకోనని చెప్పారు ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. బాగా ఆడేందుకే కృషి చేస్తానని చెప్పారు. కొంతకాలంగా స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించని విరాట్ కోహ్లీ.. తాజాగా ఆసియా కప్‌లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఇండియా తరఫున అత్యధిక పరుగులు (154) చేసిన ఆటగాడిగా నిలిచారు.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగులు సాధించి భారత స్కోరులో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ‘‘విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. నేను 14 ఏళ్లుగా జట్టు కోసం ఆడుతున్నాను. ఇది అనుకోకుండా రాలేదు. ఆటకోసం బాగా కష్టపడటమే నా పని. నా జట్టు కోసం మెరుగ్గా ఆడాలి. విమర్శకులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. మా పని మాత్రం బాగా ఆడటమే. 120 శాతం బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. చాలా మందికి చాలా అభిప్రాయాలుంటాయి. దానివల్ల సమస్య లేదు. వాళ్లు చేసే విమర్శలు నా సంతోషాన్ని తగ్గించలేవు’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు తాను టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు మెసేజ్ చేసింది ఎమ్ఎస్ ధోనీ ఒక్కరేనని కోహ్లీ వెల్లడించాడు.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

‘‘నేను టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు ధోనీ ఒక్కరే నాకు మెసేజ్ చేశారు. ఇంకెవరూ చేయలేదు. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంది. చాలా మంది టీవీల్లో సలహాలు ఇస్తుంటారు. కానీ, ధోనీ వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజాయితీతో కూడిన సంబంధాలుంటే, ఇరువైపుల నుంచి నమ్మకం ఉందన్న విషయం అర్థమవుతుంది. నేను ధోనీ నుంచి.. ఆయన నా నుంచి ఏమీ ఆశించలేదు. మేమిద్దరం ఎప్పుడూ అభద్రతా భావం లేము’’ అని కోహ్లీ అన్నాడు.