Virender Sehwag criticises Kohli and co: కోహ్లీతో పాటు ఇతర భారత క్రికెటర్లపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు

‘సచిన్ టెండూల్కర్ నుంచి నేను ఓ విషయం నేర్చుకున్నాను. జట్టులో ఆడుతున్న సమయంలో సచిన్ జిమ్ లో 6-8 కిలోల కంటే ఎక్కువ బరువు ఎత్తడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. అధిక బరువు ఎందుకు ఎత్తట్లేవని అడిగాను. దానికి సచిన్ ఏమన్నాడో తెలుసా. తాను మ్యాచ్ ఆడాల్సి ఉందని, ఫాంను కొనసాగించడానికే తక్కువ బరువును ఎత్తుతున్నానని, తాను తన శక్తిని బరువు ఎత్తి కోల్పోనని చెప్పారు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు సిరీస్ జరుగుతోన్న సమయంలో 50-60-70 కిలోల బరువు ఎత్తుతున్నారు. ఇలా చేస్తే గాయాలయ్యే రిస్క్ అధికంగా ఉంటుంది’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.

Virender Sehwag criticises Kohli and co: కోహ్లీతో పాటు ఇతర భారత క్రికెటర్లపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు

Virender Sehwag criticises Kohli and co

Virender Sehwag criticises Kohli and co: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్న విషయంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘టీమిండియా గాయాలతో బాధపడుతోంది. అయితే, ఆటగాళ్లకు అయిన గాయాలు మైదానంలో తగిలినవి కాదు. దీన్ని ఎవరూ గుర్తించడం లేదు. చాలా మంది ఆటగాళ్లు జిమ్ లో, మ్యాచు జరగని సమయంలో గాయపడుతున్నారు. జడేజా మైదానంలో గాయపడడం మనం చూడలేదు’ అని చెప్పారు.

‘మ్యాచు ముగిసిన అనంతరం అతడు గాయపడ్డాడన్న విషయం తెలుసుకున్నాం. మైదానం వెలుపల, జిమ్ లో అవుతున్న గాయాల పట్ల మనం దృష్టి సారించాలి. నైపుణ్యాలే అతి ముఖ్యం. భారత జట్టు తరఫున ఆడుతున్న సమయంలో జిమ్ కంటే నైపుణ్యాలే ముఖ్యం. ఆటకు రెండు నెలలు దూరమైతే ఆ సమయంలో ఫిట్ నెస్ అతి ముఖ్యమవుతుంది. సచిన్ టెండూల్కర్ నుంచి నేను ఓ విషయం నేర్చుకున్నాను. జట్టులో ఆడుతున్న సమయంలో సచిన్ జిమ్ లో 6-8 కిలోల కంటే ఎక్కువ బరువు ఎత్తడాన్ని నేను ఎన్నడూ చూడలేదు’ అని సెహ్వాగ్ అన్నారు.

‘అధిక బరువు ఎందుకు ఎత్తట్లేవని అడిగాను. దానికి సచిన్ ఏమన్నాడో తెలుసా. తాను మ్యాచ్ ఆడాల్సి ఉందని, ఫాంను కొనసాగించడానికే తక్కువ బరువును ఎత్తుతున్నానని, తాను తన శక్తిని బరువు ఎత్తి కోల్పోనని చెప్పారు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు సిరీస్ జరుగుతోన్న సమయంలో 50-60-70 కిలోల బరువు ఎత్తుతున్నారు. ఇలా చేస్తే గాయాలయ్యే రిస్క్ అధికంగా ఉంటుంది’’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.

Ganesh Laddu: వేలంలో గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికిన వైనం