IPL 2021, CSK vs RR, Preview: చెన్నై చెలరేగేనా? రాజస్థాన్ గెలిచేనా?

IPL 2021, CSK vs RR, Preview: చెన్నై చెలరేగేనా? రాజస్థాన్ గెలిచేనా?

Chennai Vs Rajasthan 12th Match Preview

Dhoni vs Samson, ipl 2021 – ఐపీఎల్‌ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ఇవాళ(19 ఏప్రిల్ 2021) చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడబోతుంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై వన్‌సైడ్‌ విక్టరీ సాధించగా.. ఢిల్లీతో జరిగిన పోరులో రాయల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన దీపక్‌ చాహర్‌‌పై మరోసారి చెన్నై జట్టు ఆశలు పెట్టుకుంది.

ఐపీఎల్ 2021లో ఇది 12 వ మ్యాచ్ కాగా.. ఈరోజు రాత్రి 07:30 నుండి మొదలు కానుంది. రాజస్థాన్ చెన్నైపై మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ లేని లోటు జట్టులో కనిపిస్తుండగా.. మిల్లర్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చెన్నై మరియు రాజస్థాన్ జట్లు ఇప్పటివరకు 23 సార్లు ముఖాముఖి తలపడగా.. చెన్నై 14సార్లు గెలిచింది. అదే సమయంలో రాజస్థాన్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆధిపత్యం చెలాయించగా ఈ సీజన్‌లో గట్టిగా కష్టపడుతుంది చెన్నై జట్టు. ఈ మ్యాచ్‌లో ఫిట్‌నెస్‌ సాధించి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి నాగిడి చెన్నై జట్టులో చేరాడు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పైచేయి ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో డకౌటైన ధోనీకి పంజాబ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చాన్స్‌ రాలేదు. మరోపక్క పంజాబ్‌ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది. తమ మ్యాచ్‌లో ఫెయిల్‌ అయిన రాజస్తాన్‌ టాపార్డర్‌ నిలకడ చూపాల్సి ఉంది. అయితే డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌తో మిడిల్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. యంగ్‌ పేసర్‌ సకారియా ఆకట్టుకుంటుండగా.. సీనియర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ అంచనాలు అందుకోవడంలేదు. ముస్తాపిజు రెహమాన్‌, మోరిస్‌ కీలక సమయంలో అండగా నిలుస్తున్నారు.

ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాట్స్ మెన్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్ చూడవచ్చు. మంచు పెద్ద పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్-
Probable XI: Ruturaj Gaikwad/Robin Uthappa, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, Sam Curran, MS Dhoni, Ravindra Jadeja, Dwayne Bravo, Shardul Thakur, Deepak Chahar

రాజస్థాన్ రాయల్స్-
Probable XI: Manan Vohra/Yashasvi Jaiswal, Jos Buttler, Sanju Samson, Shivam Dube, David Miller, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Jaydev Unadkat, Chetan Sakariya, Mustafizur Rahman