Arshdeep Singh: అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు.. 16ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన భారత యువ బౌలర్

ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.(Arshdeep Singh)

Arshdeep Singh: అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు.. 16ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన భారత యువ బౌలర్

Arshdeep Singh

Arshdeep Singh : ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 3.3 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే ఎంట్రీ మ్యాచ్ లోనే ఒక మెయిడిన్ ఓవర్ వేసి 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో అజిత్ అగార్కర్, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఝులన్ గోస్వామి ఈ ఘనత సాధించారు.

ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 ద్వారా అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐదవ టెస్ట్ తర్వాత భారత సెలెక్టర్లు జస్ప్రీత్ బుమ్రాకు మొదటి T20I కోసం విశ్రాంతి ఇవ్వడంతో, పంజాబ్ పేసర్‌కు అవకాశం దక్కింది. అరంగేట్రంలోనే మెయిడిన్ ఓవర్ వేసిన రికార్డు గతంలో ఝులన్ గోస్వామి(మహిళల క్రికెట్), అజిత్ అగార్కర్‌(పురుషుల క్రికెట్) పేరిట ఉంది.(Arshdeep Singh)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అర్ష్‌దీప్ తన మొదటి ఓవర్‌ని ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్‌కి బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా చేయనివ్వకుండా బ్యాటర్ ను కట్టడి చేశాడు. అర్ష్ దీప్ సింగ్.. స్వింగ్‌ను ఉత్తమంగా ఉపయోగించాడు. 4 బంతికి రాయ్ రెండు పరుగులు తీశాడు, అయితే లెగ్-బై గా అంపైర్ ప్రకటించడంతో.. మెయిడెన్ ఓవర్‌ అయ్యింది. అలా అరంగ్రేటం మ్యాచ్ లోనే మెయిడిన్ ఓవర్ వేసిన ఘనత నమోదు చేశాడు.

India vs England: ఈ ఓట‌మితో టీమిండియాకు షాక్‌: అజిత్ అగార్క‌ర్

ఝులన్ గోస్వామి, అజిత్ అగార్కర్‌లతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ టీ20 అరంగేట్రంలో భారత్ తరఫున అరుదైన రికార్డును నమోదు చేశాడు. 2006లో జులన్ గోస్వామి, అజిత్ అగార్కర్ ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాత తొలి T20I అరంగేట్రం చేసిన మూడో భారతీయ బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. గోస్వామి, అగార్కర్ ఇద్దరూ వరుసగా మహిళల, పురుషుల క్రికెట్‌కు మొదటి T20 అంతర్జాతీయ గేమ్‌లలో తమ తొలి ఓవర్లు మెయిడిన్ గా చేశారు. గోస్వామి తన మొదటి ఓవర్‌ని అప్పటి ఇంగ్లండ్ స్కిప్పర్ షార్లెట్ ఎడ్వర్డ్స్‌కి వేసింది.

ఆగస్టు 2006లో డెర్బీలో ఆ ఓవర్‌లోని ఐదవ బంతికి షార్లెట్ ను క్లీన్ చేసింది. మరోవైపు, అగార్కర్ తన T20I కెరీర్‌లో మొదటి బంతికే దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ వికెట్‌ను తీశాడు. డిసెంబర్ 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో జస్టిన్ కెంప్‌కి ఐదు డాట్ బాల్స్‌తో ఓవర్ ని ముగించాడు. గోస్వామి, అగార్కర్ అరంగేట్రంలో తమ తొలి ఓవర్ బౌలింగ్ చేసినప్పుడు అర్ష్ దీప్ సింగ్ కు ఏడేళ్లు. 16 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని సాధించాడు.

ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీకి తోడు రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో భారత్ తొలుత 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.

బ్యాటింగ్ లో రాణించిన పాండ్యా.. బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. పాండ్యా విసిరిన పదునైన బంతులను ఎదుర్కోలేని ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. మొయిన్ అలీ చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, యుజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.