Steve Smith: పాకిస్తాన్‌లో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తనకు పాకిస్తాన్ లో చాలా సురక్షితంగా అనిపిస్తుందని అంటున్నాడు. తన సహచరుడైన ఆష్టన్ అగర్ ఆన్‌లైన్‌లో బెదిరింపు ఎదుర్కొన్న తర్వాత అలాంటిదేం లేదని

Steve Smith: పాకిస్తాన్‌లో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది

Steve Smith

Steve Smith: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తనకు పాకిస్తాన్ లో చాలా సురక్షితంగా అనిపిస్తుందని అంటున్నాడు. తన సహచరుడైన ఆష్టన్ అగర్ ఆన్‌లైన్‌లో బెదిరింపు ఎదుర్కొన్న తర్వాత అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు. అగర్‌కు బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు సమాచారం అందించామని చెప్పాడు.

ఆ బెదిరింపు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిందని తేలింది. ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిటీలపై ప్రత్యేక సెక్యూరిటీని పొడిగిస్తున్నట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

రావాల్సిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఆస్ట్రేలియా ప్లేయర్లు తాము ఈ మ్యాచ్ ఆడేందుకు కుతూహలంగా ఉన్నామని అన్నాడు.

Read Also : లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. గంటసేపు టెన్షన్

‘సోషల్ మీడియా, దురదృష్టకరంగా జరిగిన ఘటనల కారణంగా పూర్తి అవగాహనతో ఉన్నాం. మాతో పాటు కలిసి పనిచేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మా సెక్యూరిటీని నమ్ముతున్నాం. ఇక్కడ పాకిస్తాన్ లో సేఫ్ గా ఉన్నాం’ అని స్మిత్ ఇంగ్లీష్ మీడియాతో చెప్పాడు.

తొలి టెస్టుకు ముందు నెట్స్ లో ప్రాక్టీ చేసిన స్మిత్.. కాస్త అలసటగా కనిపించాడు. శ్రీలంక వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ లో గాయపడ్డ స్మిత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పాకిస్తాన్ వేదికగా జరిగే ఈ టెస్టు సిరీస్ మార్చి 4 నుంచి ఆరంభం కానుంది.