ఫుట్‌బాల్ ప్లేయర్ నెల జీతం రూ.67కోట్లకు పైనే

ఫుట్‌బాల్ ప్లేయర్ నెల జీతం రూ.67కోట్లకు పైనే

ఓ మధ్య తరగతి కుటుంబీకుడు జీవిత కల ఓ కారు కొనుక్కోవాలనో.. లేదా కొన్నిలక్షల విలువైన ఇల్లుని సొంతం చేసుకోవాలనో ఉంటుంది. కానీ, తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజుల నుంచి నెల పూర్తయ్యేసరికి కోట్లలో ఆధాయం గడిస్తున్న ఫుట్‌బాల్ ప్లేయర్ల నిజమైన జీతాలు మీకు తెలుసా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ప్రస్తుతం అధికంగా సంపాదిస్తున్న వారిలో లియోనల్ మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డొల పేర్లే మనకు వినిపిస్తాయి. ఎందుకంటే వారి ఆధాయం కోట్లకు మించింది కాబట్టి. అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ నెలకు 8.3మిలియన్ యూరోలు సంపాదిస్తాడట అంటే (67కోట్ల 12లక్షల 19వేల 589కుపైనే). మెస్సీకి ఇంత సంపాదన రావడానికి కారణం సంపాదనలో రెండో స్థానంలో ఉన్న క్రిస్టియన్ రొనాల్డోనే. 

స్పానిష్ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో 9ఏళ్ల పాటు ఆడి జ్యూవెంటస్ క్లబ్‌కు మారాడు. గతం కంటే ఎక్కువగా ముట్టజెప్పుతుండటంతో క్లబ్‌ను మార్చేశాడు. బార్సిలోనా క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లియోనల్ మెస్సీ ఒప్పంద కాలం పూర్తవడం మరో పక్క అతనికి పోటీగా ఉన్న రొనాల్డొ క్లబ్ మారిపోవడంతో ఎక్కడ మెస్సీ తమ జట్టుకు దక్కకుండా పోతాడోనని అడిగినంత ఇచ్చేసి ఉంచేసుకుంది బార్సిలోనా. 

వారితో పాటుగా టాప్ 10లో సంపాదించుకుంటున్న ఫుట్‌బాల్ ప్లేయర్ల నెలవారీ జీతాలు గమనిస్తే.. 

  • లియోనల్ మెస్సీ(బార్సిలోనా)- దాదాపు రూ.67కోట్ల 12లక్షల 19వేల 589కుపైనే
  • రొనాల్డొ(జ్యూవెంటస్)- దాదాపు రూ.37కోట్ల 99లక్షల 61వేల 59కు పైనే
  • గ్రిజ్‌మాన్(అట్లెటికో మాడ్రిడ్)- దాదాపు రూ.26కోట్ల 67లక్షల 81వేల169కు పైనే
  • నేమార్(పీఎస్‌జీ)- దాదాపు రూ.24కోట్ల 73లక్షల78వేల902కు పైనే
  • సూరెజ్(బార్సిలోనా)- దాదాపు రూ.23కోట్ల 44లక్షల 44వేల 058కు పైనే
  • బాలె(రియల్ మాడ్రిడ్)- దాదాపు రూ.20 కోట్ల 21లక్షల 40వేలు
  • కౌటిన్హో(బార్సిలోనా)- దాదాపు రూ.18కోట్ల 59లక్షల 67వేల 905కు పైనే
  • అలెక్సిస్(మాంచెస్టర్ యునైటెడ్)- దాదాపు రూ.18కోట్ల 43లక్షల 50వేల 793కు పైనే
  • ఎంబాపే(పీఎస్‌జీ)- దాదాపు రూ.13కోట్ల 98లక్షల 87వేల 074కు పైనే
  • ఓజిల్(అర్సెనల్)- దాదాపు రూ.12కోట్ల 93లక్షల 75వేల 329కు పైనే