IND vs SL: ఇలా అయితే టెస్టు టీంలో నీ ప్లేస్ కష్టమే – గంభీర్

ఇండియన్ టెస్టు టీంలో 2018 నుంచి ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌కు కేఎల్ రాహుల్ గైర్హాజరీతో తుది జట్టులో స్థానం దొరికింది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో తొలి టెస్టులో అవకాశాన్ని సద్వినియ

IND vs SL: ఇలా అయితే టెస్టు టీంలో నీ ప్లేస్ కష్టమే – గంభీర్

Gambhir Subhan 10tv

IND vs SL: ఇండియన్ టెస్టు టీంలో 2018 నుంచి ఆడుతున్న మయాంక్ అగర్వాల్‌కు కేఎల్ రాహుల్ గైర్హాజరీతో తుది జట్టులో స్థానం దొరికింది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో తొలి టెస్టులో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం 33పరుగులతోనే ముగించేశాడు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ప్రదర్శన సంతృప్తికరంగా లేదని ఇలా అయితే టెస్టు టీంలో స్థానం కొనసాగించడం కష్టమని జోస్యం చెప్పాడు.

మయాంక్ ఎక్కువ స్కోరు చేస్తే.. టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉండేవి. అల్ప స్కోరు నమోదు చేస్తే టెస్టు టీంలో అతని స్థానం సెక్యూర్ గా ఉండదనిపిస్తున్నట్లు తెలిపాడు.

‘లసిత్ ఎంబుల్డేనియా, లహిరు కుమారాలతో పాటు చాలా మంది బౌలర్లు మయాంక్‌ను ఇబ్బందిపెట్టారు. ప్రత్యేకించి ఇన్నింగ్స్ ఆరంభంలో.. అంటే కచ్చితంగా అసంతృప్తికి గురి చేశాడు. భారీ స్కోరు నమోదు చేసి ఉంటే బాగుండేది. కేఎల్ రాహుల్ తిరిగొస్తే తన స్థానం సెక్యూర్ గా ఉండదనే అనుకుంటున్నా. అతను చేయాల్సింది వీలైనంత వరకూ భారీ స్కోరు నమోదు చేయడమే’ అని గంభీర్ స్టార్ స్పోర్స్ తో లంచ్ షోలో పాల్గొని మాట్లాడాడు.

Read Also: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

తొలి సెషన్ లో ఐదు మంచి బౌండరీలు బాదిన మయాంక్.. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా 19వ ఓవర్ లో ట్రాప్ అయిపోయాడు. నిజానిక రోహిత్, మయాంక్ ఇద్దరూ తొలి వికెట్ కోల్పోవడానికి ముందు 52పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని నమోదు చేశారు. లహిరు కుమార్ తొలి వికెట్‌గా రోహిత్ ను 10వ ఓవర్లో అవుట్ చేశాడు.